బ్రేకింగ్: మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..

Maharashtra and Haryana elections on October 21st, బ్రేకింగ్: మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..

మహారాష్ట్ర, హర్యానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మహారాష్ట్రలో 288 స్థానాలకు, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను సిఈసీ మీడియాకి తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ని అమల్లోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలో 1.8 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. అలాగే.. హర్యానాలో లక్షా 30 వేల ఈవీఎంలను వినియోగించనున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 9కి, హర్యానా అసెంబ్లీ గడువు నవంబర్ 2తో ముగియనుంది.

మహారాష్ట్రలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 8.94 కోట్లు, హర్యానాలో 1.28 కోట్ల మంది. పాస్టిక్ రహితంగా ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపారు. అసత్యప్రచారాలకు.. సోషల్ మీడియాపైన గట్టి నిఘా పెట్టినట్టు తెలిపారు. కాగా.. అభ్యర్థుల ప్రచార ఖర్చు పరిశీలను అబ్జర్వర్‌ను నియమిస్తామన్నారు. ప్రతీ అభ్యర్థి ఖర్చు రూ.28 లక్షలకు మించి చేసేందుకు అనుమతిచ్చారు. మహారాష్ట్ర, హర్యానాలో అక్టోబర్ 21న ఎన్నికలు జరుగగా.. ఆ నెల 24నే ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నెల 27న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 4న నామినేషన్లకు చివరి తేదీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *