ఖైదీల్లో మార్పు తెస్తున్న‌ ‘మహాపరివర్తన్’

రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అమలు చేస్తున్న మహాపరివర్తన్‌ కార్యక్రమం వల్ల ఖైదీలు తిరిగి నేరాలు చేయకుండా కష్టపడి జీవిస్తూ కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నారని  రాష్ట్ర జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. . జైళ్లపై కొందరు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని, వరంగల్‌ సెంట్రల్‌ జైలు పరిసరాలు చాలా ప్రశాంతంగా, విశాలంగా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతీ జిల్లా జైలులో ఒక రోజు నిద్ర చేస్తున్నానని, ఖైదీల సమస్యలు తెలుసుకునేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. […]

ఖైదీల్లో మార్పు తెస్తున్న‌ 'మహాపరివర్తన్'
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:47 PM

రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అమలు చేస్తున్న మహాపరివర్తన్‌ కార్యక్రమం వల్ల ఖైదీలు తిరిగి నేరాలు చేయకుండా కష్టపడి జీవిస్తూ కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నారని  రాష్ట్ర జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. . జైళ్లపై కొందరు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని, వరంగల్‌ సెంట్రల్‌ జైలు పరిసరాలు చాలా ప్రశాంతంగా, విశాలంగా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతీ జిల్లా జైలులో ఒక రోజు నిద్ర చేస్తున్నానని, ఖైదీల సమస్యలు తెలుసుకునేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు జైళ్ల నిర్వహణపై ఒక్క ఫిర్యాదు కూడా తమ దృష్టికి రాలేదన్నారు. జైళ్లలో అవినీతి జరుగుతోందని ఎవరైనా రుజువు చేస్తే రూ. 10 వేల నగదు పారితోషికం ఇస్తామని ప్రకటించారు.

దేశంలోని అన్ని జైళ్లకంటే తెలంగాణ రాష్ట్రంలోని కేంద్రకారాగారాలు, సబ్‌జైళ్లు నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాయన్నారు. రాష్ట్ర జైళ్లపై ప్రపంచ మేధావులు, ఇతర రాష్ట్రాల జైళ్ల శాఖ అధికారులు పరిశోధనలు చేస్తున్నారని, కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడి విధానాలను అమలు చేస్తున్నారని చెప్పారు. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిని ఖైదీలు అనకుండా ఆశ్రమవాసులుగా పిలుస్తున్నామని, వారిలో మంచి మార్పును చూస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు జైళ్లశాఖ రూ.495 కోట్ల ఆదాయం కలిగి ఉందని అన్నారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతీ ఖైదీకి మంచం, పరుపు అందిస్తున్నామని, ప్రతీ మహిళా ఖైదీకి ఈ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.