చైనాలో ‘సావిత్రి’ సత్తా.. ‘మహానటి’కి అరుదైన గౌరవం..

అలనాటి దిగ్గజ నటి సావిత్రి జీవిత కథాధారంగా రూపొందించిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమాలో హీరోయిన్ కీర్తీ సురేష్ సావిత్రిని మెప్పించేలా నటించింది. అయితే.. ఈ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా ఈ చిత్రం రికార్డులకెక్కింది. ఇంటర్నేషనల్ పనోరమ విభాగంలో ఈ సినిమాను ఎంపిక చేశారు. ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా మెయిన్ ల్యాండ్ చైనాలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను వైజ‌యంతీ, స్వప్న […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:02 am, Sat, 4 May 19

అలనాటి దిగ్గజ నటి సావిత్రి జీవిత కథాధారంగా రూపొందించిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమాలో హీరోయిన్ కీర్తీ సురేష్ సావిత్రిని మెప్పించేలా నటించింది. అయితే.. ఈ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా ఈ చిత్రం రికార్డులకెక్కింది. ఇంటర్నేషనల్ పనోరమ విభాగంలో ఈ సినిమాను ఎంపిక చేశారు. ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా మెయిన్ ల్యాండ్ చైనాలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.

ఈ సినిమాను వైజ‌యంతీ, స్వప్న మూవీస్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నటి కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర‌లో నటించగా, దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా ద‌క్షిణాది స్టార్స్ అంద‌రూ ఈ చిత్రంలో న‌టించారు.