Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 90 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 190535. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 93322. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 91819. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5394. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని నివాసంలో సుదీర్గంగా సాగిన కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం. మోడీ పాలన రెండవ విడత లో ఏడాది పూర్తయిన తరువాత తొలిసారి జరిగిన కేబినెట్ భేటీ. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. మద్యాహ్నం 3 గంటలకు కేబినెట్ నిర్ణయాలు ప్రకటించనున్న కేంద్రమంత్రులు. దేశ ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్,చైనా భారత్ సరిహద్దు వివాదం అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
  • జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) వెంట భారత బలగాలు జరిపిన కాల్పుల్లో 3 మంది ఉగ్రవాదులు మృతి.
  • రుతుపవనాల కదలికకు మరింత అనువైన పరిస్థితులు. జూన్-సెప్టెంబర్ మాసాల మధ్య దేశవ్యాప్తంగా 102% వర్షపాతం. సగటున దేశం మొత్తమ్మీద 88 సెం.మీ వర్షపాతం. డా. మాధవన్ నాయర్ రాజీవన్, ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి.
  • చెన్నై : కోలీవుడ్ లో ముదురుతున్న గాడ్ మాన్ వెబ్ సిరీస్ వివాదం. గాడ్ మాన్ వెబ్ సిరీస్ ట్రైలర్,టీజర్ ని విడుదల చేసిన నిర్మాణ సంస్థ . ట్రైలర్ లో బ్రహ్మనులను కించపరుస్తూ సంభషణలు ,సన్నివేశాలుండడం ఫై బీజేపీ నేతలు,హిందూ సంఘాలు ఆగ్రహం . నిర్మాణ సంస్థ ,దర్శకుడి ఫై పోలీసులకు ఫిర్యాదు ,6 సెక్షన్ లలో కేసు నమోదు చేసిన పోలీసులు . ట్రైలర్ ,టీజర్ లను యూట్యూబ్ నుండి తొలగించిన నిర్మాణ సంస్థ.
  • ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్. 2 వారాల క్రితం ముంబై నుండి డిల్లీకి వచ్చిన ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ సైంటిస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సైoటిస్ట్. ICMR HQ లలో సమావేశం కోసం ఢిల్లీ కి వచ్చినట్లు అధికారులు వెల్లడి. భవనాన్ని శాని టైజేషన్ చేస్తున్న అధికారులు.

జూమ్ యాప్‌లో “మహానాడు”

TDP officially decides, జూమ్ యాప్‌లో “మహానాడు”

కరోనా మహమ్మారి దెబ్బ అన్ని రంగాలపై పడింది. చివరకు రాజకీయపార్టీలకు కూడా ఆ కష్టాలు తప్పడం లేదు. తెలుగుదేశంపార్టీ ప్రతియేటా ఘనంగా నిర్వహించే మహానాడు సమావేశాలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. దీంతో పార్టీ ముఖ్యనేతలు మహానాడు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈసారి మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నెల 27, 28 తేదీల్లో ఆరు గంటల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే మహానాడులో 14 వేల మంది పాల్గొనేలా పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశంపార్టీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. మహానాడు నిర్వహణ, తీర్మానాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. భౌతిక దూరం పాటిస్తూ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

లాక్ డౌన్ విధించినప్పటి నుంచి టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు జామ్ యాప్ ద్వారా మీడియా సమావేశాలు, పార్టీ అంతర్గత మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా సమావేశాలు జరుగుతున్నాయని చంద్రబాబు భావించారు. దివంగత ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్వహించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Related Tags