Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

పాలమూరులో పచ్చ పార్టీ ఖతం.. వీరూ త్వరలోనే..

mahabubnagar tdp empty soon, పాలమూరులో పచ్చ పార్టీ ఖతం.. వీరూ త్వరలోనే..

తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లా ఒకప్పుడు కంచుకోట… దశాబ్దాల చరిత్ర ఉండి.. ఎంతో మంది రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లాలో ఇపుడు తెలుగుదేశం పార్టీ అంపశయ్యకు చేరింది. కీలకనేతలంతా ఇతర పార్టీల్లో చేరారు. నిన్న మొన్నటి వరకు పార్టీని అంటి పెట్టుకొని ఉన్న మరికొంత మంది నేతలు కూడా బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. దీంతో పాలమూరు జిల్లాలో పచ్చ పార్టీ పత్తా లేకుండా పోనుందనే చర్చ జరగుతోంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ ఒకప్పుడు తెలుగుదేశం బలంగా ఉండేది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పార్టీ రోజు రోజుకు బలహీన పడింది. జిల్లాలో కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరారు. ఒకరిద్దరు బలమైన నేతలు పార్టీని అంటి పెట్టుకొని ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వారు కూడా పార్టీ మారేందుకు సిద్ధమౌతున్నారని విశ్వసనీయ సమాచారం.

ఉమ్మడి పాలమూరులో ఇప్పటి వరకు టీడీపీలో ఉన్న నేతలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి. ఈ ఇద్దరు నేతలు కూడా పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారని చర్చ జరుగుతోంది. కమల దళంలో చేరేందుకు సిద్ధమౌతున్నారని తెలుస్తోంది. అందుకు ఢిల్లీ స్థాయిలో మంతనాలు కూడా జరుగుతున్నయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో వీరు ఎక్కడా చురుకుగా పాల్గొన్న దాఖలాలు లేవు. దీంతో వీరు పార్టీ మారుతున్నారనే ప్రచారం మొదలైంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ ఉద్దండుల్లా పేరున్న టిడిపి నేతలంతా ఎన్నికలకు ముందే ఇతర పార్టీల్లోకి చేరారు. నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పి. రాములు, ఎర్రశేఖర్ లాంటి నేతలంతా పార్టీ పరిస్థితి బలహీన పడుతున్న నేపధ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఇతర పార్టీల్లో చేరారు. అయితే కొత్తకోట దంపతులతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే టిడిపిని అంటిపెట్టుకొని ఇన్నాళ్లు కొనసాగారు.

అయితే తెలంగాణాలో టిడిపికి ఉనికి లేకపోవడంతో ప్రస్తుతం వీరు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం జిల్లాలో కొనసాగుతోంది. మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు మంచి పట్టు ఉంది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ అక్కడ టిక్కెట్ల పై స్పష్టమైన హామీ రాకపోవడంతో తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని టీడీపీలోనే కొనసాగారట.

అయితే ఎన్నికల తర్వాత తెలంగాణాపై ఫోకస్ పెట్టి కీలక నేతలను చేర్చుకునే పనిలోపడింది బీజేపీ. ఇందులో భాగంగా దయాకర్ రెడ్డి దంపతులను బీజేపీలో చేర్చుకోవడానికి చర్చలు జరిపారని సమాచారం. రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు బలంగా ఉండడంతో పాటు ఆ పార్టీల్లో రావుల చంద్రశేఖర్ రెడ్డికి అవకాశం లేకపోవడం వల్ల ఆయన కూడా కమలం వైపు చూస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు.

Related Tags