Maha Shivaratri: పరమశివుడిని ఏ ద్రవ్యంతో అభిషేకిస్తే.. ఏ ఫలితం దక్కుతుంది…

భోలాశంకరుడైన పరమ శివుడు అభిషేక ప్రియుడు. పిలిస్తే పలికే దైవం అయిన ఈ మణికంఠుడికి అభిషేకం చేస్తే ఎన్నో విశేష ప్రయోజనాలను పొందవచ్చునని శివ పురాణం చెబుతోంది. అంతేకాకుండా అభిషేకం సమయంలో దేవుడి విగ్రహాల

Maha Shivaratri: పరమశివుడిని ఏ ద్రవ్యంతో అభిషేకిస్తే.. ఏ ఫలితం దక్కుతుంది...
Follow us

|

Updated on: Feb 20, 2020 | 9:47 PM

Maha Shivaratri: భోలాశంకరుడైన పరమ శివుడు అభిషేక ప్రియుడు. పిలిస్తే పలికే దైవం అయిన ఈ మణికంఠుడికి అభిషేకం చేస్తే ఎన్నో విశేష ప్రయోజనాలను పొందవచ్చునని శివ పురాణం చెబుతోంది. అంతేకాకుండా అభిషేకం సమయంలో దేవుడి విగ్రహాల నుంచి వెలువడే విలువైన శక్తుల ద్వారా శుభ ఫలితాలు దక్కుతాయని అంటుంటారు. మరి శివరాత్రి పర్వదినం నాడు శివునికి ఎలాంటి పదార్ధాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read: TTD Tirumala Vada Prasadam For Devotees

  • తిరుమంజపొడితో అభిషేకం చేస్తే దైవానుగ్రహం లభించడమే కాకుండా.. గ్రహదోషాలు తొలిగిపోతాయి…
  • బియ్యపిండితో శివునికి అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలిగిపోతాయి…
  • చందనాది తైలంతో అభిషేకం చేస్తే ఉదర సంబంధిత రోగాలు మాయమవుతాయి…
  • పంచామృతంతో శివునికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి…
  • నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం లభిస్తుంది…
  • పాలతో ముక్కంటికి అభిషేకం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది..
  • పెరుగుతో అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి చేకూరుతుంది…
  • బత్తాయి పండ్ల రసంతో శివునికి అభిషేకం చేస్తే ఆయురారోగ్యాలతో వర్దిల్లుతారు…
  • చెరుకురసంతో శివాభిషేకం చేస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది..
  • నిమ్మరసంతో శివునికి అభిషేకం చేస్తే శత్రుభయం పోతుంది..
  • కొబ్బరి నీటితో చేస్తే ఉన్నత పదవులు, కీర్తి లభిస్తుంది..
  • ఉసిరికాయపొడితో శివాభిషేకం చేస్తే రోగాలు దరికి చేరవు..
  • పన్నీరుతో శివునికి అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది..
  • చందనంతో శివాభిషేకం చేస్తే కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి…
  • చివరిగా తేనెతో అభిషేకం చేస్తే అద్భుతమైన గాత్రం సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి..

అంతేకాకుండా బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులు, మందార పువ్వులను శివపూజలో తప్పకుండా సమర్పించాలి.  వీటి వల్ల శివానుగ్రహం లభిస్తుందని పెద్దలు అంటుంటారు.

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..