వరద ప్రభావిత ప్రాంతాలకు రూ. 10 వేల కోట్ల ప్యాకేజీ..

వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు మహారాష్ట్ర సర్కార్ భారీ ప్యాకేజీని ప్రకటించింది.   ప్ర‌భుత్వం రూ.10 వేల కోట్ల ప్ర‌త్యేక ప్యాకేజీని ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఈ మేర‌కు మ‌హారాష్ట్ర స‌ర్కారు...

వరద ప్రభావిత ప్రాంతాలకు రూ. 10 వేల కోట్ల ప్యాకేజీ..
Follow us

|

Updated on: Oct 23, 2020 | 4:11 PM

Package For Rain Affected Parts : వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు మహారాష్ట్ర సర్కార్ భారీ ప్యాకేజీని ప్రకటించింది.   ప్ర‌భుత్వం రూ.10 వేల కోట్ల ప్ర‌త్యేక ప్యాకేజీని ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఈ మేర‌కు మ‌హారాష్ట్ర స‌ర్కారు ఒక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. దీపావ‌ళి పండుగ లోగా ఈ ప‌ది వేల కోట్ల న‌గ‌దును బాధితుల‌కు పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

ఈ విష‌యాన్ని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి కార్యాల‌యం (CMO) కూడా మీడియాకు వెల్ల‌డించింది. అయితే ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌లో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లు కాల‌నీలు నీటి మునిగాయి. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆస్తిన‌ష్టం భారీగా జరిగింది. ఈ నేప‌థ్యంలో బాధితుల‌ను ఆదుకునేందుకు మ‌హా స‌ర్కారు ప్ర‌త్యేక ప్యాకేజీ అందిస్తోంది.

గత వారం రోజుల క్రితం కురుసిన భారీ వర్షాలతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇందులో పుణే, ఔరంగాబాద్ జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్రాలు చాలా మట్టుకు నీట మునిగాయి. ఈ ప్రభావంతో చేతికి అందివచ్చిన పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్ట పోయారని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. వారి కోసం మహారాష్ట్ర ప్రభుత్వ ఈ పది వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.