Breaking News
  • దేశంలో కరోన బాధితుల సంఖ్య 4789కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 4312 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 352మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 124 మంది మృతి. సాయంత్రం 6.00 గంటల వరకు వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ. గడచిన 24 గంటల్లో 508 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13మంది మృతి.
  • శరవేగంగా రూపుదిద్దుకున్న గచ్చిబౌలి ఐసోలేషన్‌ సెంటర్‌. అత్యాధునిక ఐసోలేషన్‌ సెంటర్‌గా గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌. అంతర్జాతీయ స్థాయిలో కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఉన్న సదుపాయాలు. మొత్తం 14 అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వెంటిలేటర్‌ సదుపాయం. ఇప్పటికే మూడు అంతస్తుల్లో 1,500 బెడ్స్‌ సిద్ధం. ఒక్కో ఫ్లోర్‌కు 36 గదులు, ప్రతి గదిలో 2 బెడ్స్‌. మరో 11 ఫ్లోర్లు శరవేంగా సిద్ధం చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ. రోజుకు 24 గంటలు 1,200 మంది వైద్య సిబ్బంది విధులు. ఉస్మానియా ఆస్పత్రికి అనుసంధానంగా పని చేయనున్న గచ్చిబౌలి ఐసోలేషన్‌ సెంటర్‌.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది.. విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానితులందరినీ ఇప్పటికే క్వారంటైన్, ఐషోలేషన్ కేంద్రాలకు తరలించిన అధికారులు.. ఇంటింటి సర్వేను కూడా మరోసారి వేగవంతం చేశారు.
  • భారత్‌ దగ్గర సరిపడ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఉంది. లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు-లవ్‌ అగర్వాల్‌.
  • లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్‌ పొడిగించాలని కేంద్రంపై వివిధ రాష్ట్రాల ఒత్తిడి. లాక్‌డౌన్‌ పొడిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీని కోరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌. కేసీఆర్‌ బాటలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ఠాక్రే. లాక్‌డౌన్‌ను పొడిగించాలిన కేంద్రాన్ని కోరిన యూపీ సర్కార్‌.

ఇదేం మాయరా బాబు.. వండకుండానే అన్నంలా మారిపోతున్న బియ్యం

Telugu News, ఇదేం మాయరా బాబు.. వండకుండానే  అన్నంలా మారిపోతున్న బియ్యం

ఎక్కడైనా సరే అన్నం తినాలంటే బియ్యం పొయ్యిమీద ఉడకాల్సిందే. మరి బియ్యం ఉడికించకుండానే అన్నంలాగ మరిపోతే. ఇదేదో మాయాబజార్ సినిమా సీన్ అనుకోకండి . ఇది నిజంగా నిజం. పొయ్యిమీద వండి.. వార్చీ శ్రమ పడాల్సిన పనిలేకుండా దానంతట అదే అన్నంలా మారిపోయే బియ్యం కూడా ఉన్నాయంటే నమ్ముతారా? ఎవరు నమ్మినా నమ్మక పోయినా సరే.. అలాంటి బియ్యం కూడా ఉన్నాయి. అవి ఎక్కడో కాదు.. మన దేశంలోనే.

మొఘలాయిల కాలంలో ఈ బియ్యాన్ని విరివిగా సాగుచేసేవారు. 17 శతాబ్దంలో యుద్ధసమయాల్లో సైనికులు ఈ బియ్యంతోనే ఆకలి తీర్చుకునేవారట. అయితే కాలక్రమేణా దీని ప్రాధాన్యత తగ్గిపోవడంతో కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే ఈ బియ్యం పరిమితమైపోయాయి. ఇంతకీ ఈ బియ్యాన్ని ఏమంటారు? ఎక్కడ లభ్యమవుతాయి? వీటిని ఎవరు పండిస్తున్నారు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం.

అసోంలో తరతరాలుగా ఈ బియ్యాన్ని సాగుచేస్తున్నారు. దీన్ని ”బోకో సౌల్” లేదా “మట్టి బియ్యం” అని పిలుస్తుంటారు. అయితే ఈ బియ్యానికి మరో పేరుకూడా ఉంది. అదే “మ్యాజిక్ రైస్”. నిజంగా ఈ బియ్యం మ్యాజిక్ రైసే.. ఎందుకంటే వీటిని అన్నం వండే పాత్రలోకి తీసుకుని ఒక గంట సేపు నానబెట్టి ఉంచితే అచ్చం వండివార్చిన అన్నంలాగే రెడీ అయిపోతుంది. పైసా ఖర్చులేదు, గ్యాస్ అయిపోతుందన్న బెంగ కూడా లేదు.

ఈ బియ్యాన్ని పండించేందుకు జూన్ నెల నుంచి డిసెంబర్ వరకూ ఆరు నెలలు అనుకూలమంటున్నారు అక్కడి రైతులు. వీటిని కొంతమంది శతాబ్దాల తరబడి పండిస్తూనే వస్తున్నారు. దీనికి కేంద్రం ప్రభుత్వం పేటెంట్ కూడా ఇవ్వడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మ్యాజిక్ రైస్ కోసం చర్చకు దారితీసింది. అయితే స్వదేశీ పరిఙ్ఞానంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు మరోసారి ఈ వంగడాన్నిసృష్టించారు.

అసోంలో అనాది కాలంగా వస్తున్న ఈ బియ్యం సాగుపై గువాహటీ విశ్వవిద్యాలయంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. అసలు వండకుండా అన్నం ఎలా రెడీ అవుతుందన్న విషయం ఇప్పటికీ తెలలేదు. అయితే మామూలుగా వండితే ఎలా ఉంటుందో.. అచ్చం ఇది కూడా అలాగే ఉండటంతో పరిశోధక విద్యార్ధులే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎలాంటి ఖర్చులేకుండా ఒక్క గంట చల్లటి నీటిలో ఈ బోకో సౌల్ బియ్యాన్ని నానబెడితే చాలు. పువ్వులా విచ్చుకున్న తెల్లటి అన్నం రెడీ అవుతుందంటున్నారు అసోం ప్రజలు. దీనితోనే పలు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రజలు వారి ప్రత్యేక పండుగలు, కార్యక్రమాలన్నీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి పంటలు దేశంలో మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తే చాలా బాగుంటుంది కదూ..!

Related Tags