Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

బిగ్ బాస్: రెచ్చిపోయిన మాజీ లవర్స్.. పెనం‌ పట్టుకుని కొట్లాట!

Bigg Boss 13, బిగ్ బాస్: రెచ్చిపోయిన మాజీ లవర్స్.. పెనం‌ పట్టుకుని కొట్లాట!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ మరో అగ్లీ ఫైట్‌కు తెర లేపింది. మాజీ లవర్స్ విశాల్ ఆదిత్య సింగ్, మధురిమ మధ్య పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. హౌస్‌లోకి వచ్చిన తర్వాత వీరిద్దరిలో మార్పు ఉంటుందని అందరూ ఆశించగా.. ఇక్కడ సీన్ కాస్తా రివర్స్ అయింది. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సిట్యువేషన్ ఏర్పడింది.

రీసెంట్‌గా వీరిద్దరూ గొడవ పడిన తీరు.. అటు ప్రేక్షకులు.. ఇటు నిర్వాహకుల సహనానికి పరీక్ష పెట్టిందనే చెప్పాలి. ఇద్దరి మధ్యా గొడవ అంతకంతకూ తారాస్థాయికి చేరుకోవడంతో బిగ్ బాస్ ఆ జంటను జైలు‌లో బంధించి.. వారం చివర్లో ఈ తతంగంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు. ఇక దీనికి పనిష్మెంట్‌గా మధురిమను ఈ వీకెండ్‌లో సల్మాన్ ఖాన్ ఇంటి నుంచి బయటికి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే..

గార్డెన్ ఏరియాలో ఉన్న రష్మీ దేశాయ్ విశాల్‌ను టీ చేయమంటుంది. ఇక అక్కడే ఉన్న మధురిమ కూడా తనకూ కావాలని అడుగుతుంది. అయితే విశాల్ మాత్రం తాను రష్మీకి మాత్రమే చేస్తానని గట్టిగా చెబుతాడు. దీనికి కోపం తెచ్చుకున్న ఆమె.. అతడిని ‘బెహెన్‌జీ.. బెహెన్‌జీ’ అంటూ ఏడిపించడం మొదలుపెడుతుంది. దేనికైనా సరే ఒక హద్దు ఉంటుంది కదా.. ఆమె దాన్ని కూడా దాటేయడంతో విశాల్ కోపంతో ఆమెపై నీళ్లు పోస్తాడు. మధురిమ కూడా గొడవని పొడిగిస్తూ అతని యాక్షన్‌కు సరైన రియాక్షన్ ఇస్తుంది. ఇలా ఇద్దరి ఫైటింగ్ కొనసాగుతుండగా.. బిగ్ బాస్ వీళ్లిద్దరికి వార్నింగ్ ఇస్తాడు.

ఈ జంట దాన్ని సైతం బేఖాతరు చేస్తుంది. అయితే ఒకానొక సందర్భంలో విశాల్ సైలెంట్ అయిపోగా.. మధురిమ మాత్రం అతనిపైకి పెనం తీసుకుని వెళ్లి మరీ.. కొట్టడం ఆరంభిస్తుంది. దానికి అతడు ఏమి మాట్లాడకుండా దెబ్బలు భరిస్తూనే ఉంటాడు. ఇక ఈ గొడవ తారాస్థాయికి చేరుతుండటంతో.. మిగతా కంటెస్టెంట్లు రష్మీ దేశాయ్, ఆర్తి సింగ్, పరాస్, సిద్ధార్థ్, షెఫాలీలు వచ్చి మధురిమను అడ్డుకుంటారు. అంతేకాకుండా ఆమె విశాల్‌ను కొట్టిన ప్యాన్ వంగిపోయి.. విరిగిపోవడాన్ని కూడా గమనిస్తారు.

కాగా, ఈ జంట మధ్య ఇది మొదటి గొడవ కాదు.. హౌస్‌లోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సార్లు కొట్టుకుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న చిన్న విషయానికి ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఏది ఏమైనా హిందీ బిగ్ బాస్ మరో లెవెల్‌కు చేరుకుందని చెప్పాలి. ముద్దులు, రొమాన్స్, గొడవలు ఇలా అన్నింటిలోనూ పీక్స్‌కు వెళ్ళిపోయింది. త్వరలోనే తెలుగులో మొదలయ్యే నాలుగో సీజన్‌లో ఇలాంటి సన్నివేశాలు రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related Tags