కరోనాపై అవగాహన కోసం.. డ్రోన్‌తో అలర్ట్..

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 9 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచే..

కరోనాపై అవగాహన కోసం.. డ్రోన్‌తో అలర్ట్..
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2020 | 4:46 AM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 9 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. తమిళనాడులో ఇప్పటికే లక్షన్నరకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కఠిన నిర్ణయాలు చేపడుతోంది. ఇందులో భాగంగా మదురై పోలీసులు ప్రజల్లో కరోనా పట్ల అవగాహన రావడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా డ్రోన్ల సహాయంతో కరోనా అలర్ట్‌ గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. డ్రోన్లకు స్పీకర్లు పెట్టి.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. నిబంధనలను తెలియజేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా అనవసరగంగా బయటకు రావొద్దని.. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు.

కాగా, దేశంలో రోజు నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో తమిళనాడు నుంచి కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో నాలుగు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు.