తెలంగాణ మదర్సా బోర్డ్ సంచలన ప్రకటన…

ఈద్-ఉల్-అధా సందర్భంగా కుర్బానీ ఇచ్చే జంతువుల చర్మాలు మదర్సా పాఠశాలలకు ఇవ్వొద్దని ముస్లిం సమాజాన్ని జామియా నిజామియా వైస్ ఛాన్సలర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ కోరారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం..

తెలంగాణ మదర్సా బోర్డ్ సంచలన ప్రకటన...
Follow us

|

Updated on: Jul 31, 2020 | 3:16 PM

Madrasas in Telangana say No to Skin Donations :  తెలంగాణ మదర్సా కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈద్-ఉల్-అధా సందర్భంగా కుర్బానీ ఇచ్చే జంతువుల చర్మాలు మదర్సా పాఠశాలలకు ఇవ్వొద్దని ముస్లిం సమాజాన్ని జామియా నిజామియా వైస్ ఛాన్సలర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ కోరారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, చర్మం యొక్క విరాళాలను అంగీకరించకూడదని నిర్ణయం తీసుకున్నారు. బదులుగా ప్రజలు సంస్థకు డబ్బును విరాళంగా ఇవ్వవచ్చని ముఫ్తీ ఖలీల్ అహ్మద్ ఓ ప్రకటనలో కోరారు.

జామియా నిజామియా పూర్వ విద్యార్థులు సాధారణంగా జంతువుల చర్మాలు స్వీకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కౌంటర్లను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఇలాంటి కౌంటర్లు ఏర్పాటు చేయడం లేదని ప్రకటించారు. ప్రతి ఏడాది కేవలం బక్రీద్ రోజు ఈ సంస్థలకు పది వేలకు పైగా జంతు చర్మాలు వస్తుంటాయి. తెలంగాణ వ్యాప్తం మొత్తం 2 వేలకు పైగా మదర్సాలు నడుస్తున్నాయి.