ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ పై నిషేధం దిశగా తమిళనాడు ప్రభుత్వం ?

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, ఆన్ లైన్ గేమ్స్ పై నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై మీ వైఖరి ఏమిటో తెలియజేయాల్సిందిగా కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గేమ్స్ వల్ల..

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ పై నిషేధం దిశగా తమిళనాడు ప్రభుత్వం ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 15, 2020 | 7:53 PM

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, ఆన్ లైన్ గేమ్స్ పై నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై మీ వైఖరి ఏమిటో తెలియజేయాల్సిందిగా కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గేమ్స్ వల్ల యువత, పిల్లలు చెడిపోతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. అసలు ఈ సైట్స్ ని నిర్వహిస్తున్నవారిని అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలని  వారు కోరారు. దీనిపై విచారణను కోర్టు ఈ నెల 29 కి వాయిదా వేసింది. కాగా ఈ ఆన్ లైన్  గ్యాంబ్లింగ్, గేమ్స్ ను ప్రభుత్వం నిషేధించవచ్చునని తెలుస్తోంది.