గాయపడిన మహిళను భుజాలపై మోస్తూ, మనసున్న పోలీసన్న ! కదిలించే వీడియో

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో ఓ మహిళను భుజాలపై మోస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు.

  • Umakanth Rao
  • Publish Date - 12:34 pm, Thu, 19 November 20

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో ఓ మహిళను భుజాలపై మోస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. ఈ నెల 17 న మినీ ట్రక్కు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 35 మంది కూలీలు గాయపడ్డారు. ఓ పోలీసు బృందం అక్కడికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించబోయినా తగినన్ని స్టెచర్లు లేకపోవడంతో వారికి  ఇబ్బంది తలెత్తింది. దాంతో సంతోష్ సేన్, మరికొందరు పోలీసులు తామే వారిని భుజాలపై మోస్తూ హాస్పటల్ కి తీసుకువెళ్లారు. సంతోష్ సేన్ అనే పోలీసు అధికారికి సుమారు 14 ఏళ్ళ క్రితం  కుడి భుజానికి బుల్లెట్ గాయమైంది. ఈ పోలీసన్న ఉదారహృదయం వీడియోకెక్కింది.