బెంగుళూరు.. రిసార్ట్ లో మధ్యప్రదేశ్ మంత్రికి చేదు అనుభవం

బెంగుళూరులోని ఓ రిసార్ట్ లో రెబెల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వెళ్లిన మధ్యప్రదేశ్ మంత్రి జీతూ పట్వారీని పోలీసులు అడ్డుకున్నారు.

బెంగుళూరు.. రిసార్ట్ లో మధ్యప్రదేశ్ మంత్రికి చేదు అనుభవం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 12, 2020 | 5:59 PM

బెంగుళూరులోని ఓ రిసార్ట్ లో రెబెల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వెళ్లిన మధ్యప్రదేశ్ మంత్రి జీతూ పట్వారీని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను, లఖన్ సింగ్ అనే ఎమ్మెల్యేని వారు ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ రిసార్ట్ వద్ద తోపులాట జరిగి కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిరుగుబాటు శాసన సభ్యులను కలుసుకునేందుకు జీతూ పట్వారీని పోలీసులు అనుమతించలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా-తమ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసిందని, వారిని విడుదల చేయకపోతే తాము కోర్టుకెక్కుతామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అటు-జీతును పోలీసులు అడ్డుకుంటున్న వీడియో వైరల్ అయింది. బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలు ఈ రిసార్ట్ లో బస చేసిన సంగతి  విదితమే.