వివాహేతర సంబంధం.. చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు..!

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తిని కట్టేసి గంటల తరబడి చితకబాదారు. ఈ ఘటన ధార్ జిల్లాలోని అర్జున్ కాలనీలో జరిగింది. స్థానికంగా ఉండే ముఖేష్ అనే వ్యక్తి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆ మహిళతో కలిసి పారిపోయాడు. దీంతో మహిళ భర్త ధహి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

ముఖేష్ ఎక్కడున్నాడో తెలుసుకున్న గ్రామస్తులు.. ఎలాంటి హానీ చేపట్టమని, గొడవలు కూడా లేవంటూ నమ్మించారు. దీంతో పెద్దల మాటలను నమ్మిన ముఖేష్ మహిళను తీసుకొని గ్రామానికి వచ్చాడు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు ముఖేష్‌తో పాటు వివాహితను.. వారికి సహకరించిన ఓ బాలికను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలు పెట్టారు. గంటల తరబడి చితకబాదారు. ఒకరి తర్వాత ఒకరు కొడుతూనే ఉన్నారు. అయితే బాధితులు అరుపులు, కేకలు వేసినా అక్కడున్నవారు ఒక్కరు కూడా కనికరించలేదు. సెల్‌ఫోన్లతో వీడియోలు రికార్డు చేస్తున్నారు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *