వినాయక నిమజ్జనం: నాగిని డాన్స్ చేస్తూ..యువకుడి దుర్మరణం!

Man doing Nagin dance during Ganesh Chaturthi celebrations suddenly dies in MP’s Seoni, వినాయక నిమజ్జనం: నాగిని డాన్స్ చేస్తూ..యువకుడి దుర్మరణం!

వినాయక చవితి నిమజ్జన వేడుకలో ఓ వ్యక్తి అధికంగా నృత్యం చేయడమే అతడి ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సెనోయి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఘటన తాలూకు వీడియో బయటికి రావడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వినాయక నిమజ్జన ఊరేగింపులో భాగంగా కొందరు యువకులు నృత్యాలు చేస్తున్నారు. అందులో గురుచరణ్‌ ఠాకూర్‌ అనే వ్యక్తి కూడా నాగిని పాటకు నృత్యం చేస్తూ వివిధ ఆకారాల్లో శరీరాన్ని తిప్పడం ప్రారంభించాడు. అంతటితో ఆగితే సరిపోయేది. కానీ అతడు వినూత్న రీతిలో గెంతులు వేయడం కూడా ప్రారంభించాడు. ఇంతలోనే తలకిందులుగా గెంతులు వేయడానికి ప్రయత్నించడంతో తల నేలకు తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కదలికలు లేకపోవడం చూసి ఏమైందోనని అక్కడే ఉన్న స్థానికులు చూసేలోపే మృత్యుఒడిలోకి జారుకున్నాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *