మగ పిల్లాడు లేడని భూమిపై కన్నేసిన దాయాదులు

కొడుకులు లేని కుటుంబంపై దాయాదులు కక్ష కట్టారు. ఉన్న భూమిని అక్రమించుకోవాలని చూశారు. పోలీసులను అశ్రయించారంటూ.. సోదరుడని చూడకుండా చితకబాదారు. దీంతో తనకు న్యాయం కావాలంటూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు ఆ అభాగ్యుడు. మద్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.

మగ పిల్లాడు లేడని భూమిపై కన్నేసిన దాయాదులు
Follow us

|

Updated on: Jun 28, 2020 | 5:19 PM

కొడుకులు లేని కుటుంబంపై దాయాదులు కక్ష కట్టారు. ఉన్న భూమిని అక్రమించుకోవాలని చూశారు. పోలీసులను అశ్రయించారంటూ.. సోదరుడని చూడకుండా చితకబాదారు. దీంతో తనకు న్యాయం కావాలంటూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు ఆ అభాగ్యుడు.

నాగరికంగా ఎంత అభివృద్ధి చెందినా పిల్లలపట్ల లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటన మరోసారి రుజువు చేసింది. ఇప్పటి ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ నాటికీ కుమారుడు, కుమార్తెల‌ మధ్య వ్యత్యాసం క‌నిపిస్తోంది. ఛతర్‌పూర్ జిల్లాలోని మాత్‌గావ్‌ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో మోతీలాల్ రాజ్‌పుత్ దంప‌తులు నివాసముంటున్నారు. చిన్నకారు రైతు కుటుంబానికి చెందిన వారికి వారసుడు కావాలని పరితపించారు. త‌మ‌కు కొడుకు క‌ల‌గాల‌నే ఉద్దేశంతో ఏకంగా తొమ్మిదిమంది మంది కుమార్తెల‌ను క‌న్నారు. వారికి కుమారుడు లేకపోవడ‌ంతో వారికున్న కొద్దిపాటి భూమిపై మోతీలాల్ సోద‌రుల కన్ను పడింది. ఆ భూమిని ఎలాగైనా ఆక్ర‌మించుకోవాలని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు మోతీలాల్ దంపతులు. ఈ విషయం తెలుసుకున్న అతని సోదరులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో గత్యంతరం లేక మోతీలాల్ త‌న భార్య, ఐదుగురు కుమార్తెల‌తో పాటు ఎస్ఫీ కార్యాల‌యానికి చేరుకుంది. త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. త‌న‌కు కుమారులు లేని కారణంగా తన సోదరులిద్దరూ వ్య‌వ‌సాయ భూమిని లాక్కోవాల‌ని చూస్తున్నార‌ని మోతీలాల్ ఆరోపించాడు. దీనిపై ఫిర్యాదు చేసినందుకు పోలీసులు సైతం త‌న‌ను వేధిస్తున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన జిల్లా పోలీసులు అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
గంపతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళ.. అధికారులకు ముచ్చెమటలు..
గంపతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళ.. అధికారులకు ముచ్చెమటలు..