E Tendering Scam: మధ్యప్రదేశ్‌ ఈ-టెండర్ల కుంభకోణంలో ఈడీ‌ దర్యాప్తు ముమ్మరం.. ఇద్దరు అరెస్టు

E Tendering Scam: మధ్యప్రదేశ్‌ ఈ-టెండర్ల కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో హైదరాబాద్‌ ఈడీ ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది....

E Tendering Scam: మధ్యప్రదేశ్‌ ఈ-టెండర్ల కుంభకోణంలో ఈడీ‌ దర్యాప్తు ముమ్మరం.. ఇద్దరు అరెస్టు
Follow us

|

Updated on: Jan 20, 2021 | 5:51 PM

E Tendering Scam: మధ్యప్రదేశ్‌ ఈ-టెండర్ల కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో హైదరాబాద్‌ ఈడీ ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. మంతెనకన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ శ్రీనివాసరాజు, భోపాల్‌కు చెందిన ఆదిత్య ఇన్‌ఫ్రా యజమాని ఆదిత్యత్రిపాఠిలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరికి ఫిబ్రవరి 3 వరకు రిమాండ్‌ విధించింది ఈడీ కోర్టు. కుంభకోణంలో మంతెన శ్రీనివాసరాజు కీలక పాత్ర వహించినట్లు దర్యాప్తులో తేలినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. హవాలా లావాదేవీల కోసమే ఆదిత్య ఇన్‌ఫ్రా ఏర్పాటు చేశారని పేర్కొంది.

కాగా, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ-టెండరింగ్‌ కుంభకోణంలో హైదరాబాద్‌కు చెందిన సంస్థల ప్రమేయం ఉండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) హైదరాబాద్‌ విభాగం ఈ విచారణను చేపట్టింది. మధ్యప్రదేశ్‌లో 2018లో మొదటి త్రైమాసికంలో సుమారు రూ.3 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఈ-టెండర్లు ఆహ్వానించి చేపట్టారు. అయితే ప్రత్యేక పోర్టల్‌ ద్వారా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అయితే పోర్టల్‌ను హ్యాక్‌ చేసి ఇతర సంస్థలపై ఎంతకు టెండర్‌ వేశారో తెలుసుకుని అంతకంటే తక్కువ మొత్తానికి టెండర్‌ వేసి పనులు దక్కించుకున్నట్లు కొన్ని సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన సంస్థల ప్రమేయం ఉండటంతో పది రోజుల కిందట ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Also Read: Jan Dhan Account: 41 కోట్లు దాటిన జన్‌ధన్‌ ఖాతాల లబ్దిదారుల సంఖ్య.. ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..