బిగ్ బాస్‌లో మగాళ్లకు చెప్పు దెబ్బలు…

ప్రేమించిన వాళ్ళు తిట్టినా.. కొట్టినా మనం భరించక తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. ఇక ఇప్పుడు సరిగ్గా హిందీ బిగ్ బాస్‌లో కూడా ఇదే జరుగుతోంది. ఈ రియాలిటీ షో టీఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి ముఖ్యమైన కారణం సిద్ధార్థ్ శుక్లా- షెహనాజ్ గిల్ జంట అని చెప్పవచ్చు. వారిద్దరి మధ్య ఏర్పడిన బంధం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సంతోషాల్లోనే కాదు.. కష్టాల్లోనూ సిద్ధార్థ్ చెయ్యి వదలని షెహనాజ్ వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారనే చెప్పాలి. సిద్ధార్థ్ […]

బిగ్ బాస్‌లో మగాళ్లకు చెప్పు దెబ్బలు...
Follow us

|

Updated on: Jan 07, 2020 | 5:36 PM

ప్రేమించిన వాళ్ళు తిట్టినా.. కొట్టినా మనం భరించక తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. ఇక ఇప్పుడు సరిగ్గా హిందీ బిగ్ బాస్‌లో కూడా ఇదే జరుగుతోంది. ఈ రియాలిటీ షో టీఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి ముఖ్యమైన కారణం సిద్ధార్థ్ శుక్లా- షెహనాజ్ గిల్ జంట అని చెప్పవచ్చు. వారిద్దరి మధ్య ఏర్పడిన బంధం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సంతోషాల్లోనే కాదు.. కష్టాల్లోనూ సిద్ధార్థ్ చెయ్యి వదలని షెహనాజ్ వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారనే చెప్పాలి. సిద్ధార్థ్ కూడా తనకు ఇష్టమైన వాళ్ళ కోసం ప్రాణం పెడతాడు. అయితే ఇప్పుడు వీరి బంధం బీటలు వారినట్లు కనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

షెహనాజ్ సున్నిత భావాలు కలిగిన వ్యక్తి, ప్రతీ చిన్న విషయానికి హర్ట్ అవుతూ ఉంటుందని సిద్ధార్థ్ గార్డెన్ ఏరియాలో షెఫాలీ జరీవాలా, ఆర్తీ సింగ్, మహీరా శర్మలతో చెప్తాడు. ఈ విషయానికి కోపగించుకున్న షెహనాజ్ తన బెడ్ దగ్గరకు వెళ్లిపోతుంది. ఆమెను అనుసరిస్తూ వెళ్లిన సిద్ధార్థ్ మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆమె మాట్లాడకుండా.. తనని విసిగించవద్దని.. బాధపెట్టొద్దని చెబుతుంది. అంతేకాక కోపంలో పక్కన ఉన్న ఫోటో ఫ్రేమ్‌ను కూడా బద్దలు కొడుతుంది.

మరోవైపు ఈ తతంగానికి కొనసాగింపుగా సిద్ధార్థ్ మళ్ళీ అదే గార్డెన్ ఏరియాలో ‘అసూయ ఒకసారి దరికి చేరితే.. వదిలిపోదని’ మిగిలిన కంటెస్టెంట్లకు చెప్పడంతో ఆగ్రహించిన షెహనాజ్ అతనిపై చెప్పులు విసురుతుంది. అసిమ్, మధురిమ, ఆర్తిల దగ్గర బాధపడుతూ.. ‘సిద్ధార్థ్ తన పేరుని చెడగొడుతున్నాడని.. తాను ఎవరిపైనా అసూయ పడట్లేదని స్పష్టం చేస్తుంది. ఇక రెండో జంట మధురిమ, విశాల్ ఆదిత్య సింగ్ విషయానికి వస్తే..

‘చోటూ.. ఛాయ్ లేకర్ ఆనా’.. అంటూ మధురిమ విశాల్‌ను ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. దీనికి కోపం తెచ్చుకున్న విశాల్.. ‘నీ ప్రవర్తన అసలు బాగోలేదని.. విరుచుకుపడతాడు. దానికి మధురిమ అతనిపై చెప్పులు విసురుతూ.. ‘సేమ్ టూ యు’ అని అంటుంది. ఇక ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో బిగ్ బాస్ ఇరువురిని కన్‌ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. హౌస్‌లో తానైనా.. లేదా మధురిమ అయినా ఉండాలని విశాల్ డిమాండ్ చేయగా.. మధురిమను బిగ్ బాస్  రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ చేశాడు. ఇక బయటికి వచ్చిన మధురిమ విశాల్‌కు క్షమాపణ చెప్పింది. కాగా, ఈ రెండు జంటలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్.. త్వరగా మీ మధ్య ఉన్న గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని స్పష్టం చేస్తాడు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..