మెకాంజీ బెజోస్‌… ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో స్థానం!

ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో అమెజాన్‌ షేర్‌ హోల్డర్‌, రచయిత్రి మెకాంజీ చోటు దక్కించుకున్నారు. 36.8 బిలియన్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఫ్రాన్స్‌ బిలియనీర్‌ ఫ్రాంకోయిస్‌ బెట్టెన్‌కోర్ట్‌ మేయర్స్‌ 53.7 బిలియన్‌ డాలర్ల ఆర్జనతో మొదటి స్థానం దక్కించుకోగా… వాల్‌మార్ట్‌ స్థాపకుడు సామ్‌ వాల్టన్‌ కూతురు అలిస్‌ వాల్టన్‌ రెండో స్థానాన్ని(50.4 బిలియన్‌ డాలర్లు) ఆక్రమించారు. కాగా మెకాంజీ… అమెజాన్‌ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ […]

మెకాంజీ బెజోస్‌... ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో స్థానం!
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 6:54 PM

ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో అమెజాన్‌ షేర్‌ హోల్డర్‌, రచయిత్రి మెకాంజీ చోటు దక్కించుకున్నారు. 36.8 బిలియన్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఫ్రాన్స్‌ బిలియనీర్‌ ఫ్రాంకోయిస్‌ బెట్టెన్‌కోర్ట్‌ మేయర్స్‌ 53.7 బిలియన్‌ డాలర్ల ఆర్జనతో మొదటి స్థానం దక్కించుకోగా… వాల్‌మార్ట్‌ స్థాపకుడు సామ్‌ వాల్టన్‌ కూతురు అలిస్‌ వాల్టన్‌ రెండో స్థానాన్ని(50.4 బిలియన్‌ డాలర్లు) ఆక్రమించారు. కాగా మెకాంజీ… అమెజాన్‌ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య అన్న విషయం తెలిసిందే. పాతికేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు తీసుకున్నామంటూ బెజోస్‌, మెకాంజీ ఈ ఏడాది ప్రారంభంలో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని బెజోస్‌ తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో విడాకుల ఒప్పందంలో భాగంగా 37 బిలియన్‌ డాలర్ల(దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు) విలువ కలిగిన 19.7 మిలియన్‌ అమెజాన్‌ షేర్లను జెఫ్‌ బెజోస్‌ మెకాంజీ పేరిట బదలాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఫోర్బ్స్‌ సంపన్న మహిళగా నిలవడంతో.. పాటు విశ్వంలో ఉన్న సంపన్నుల జాబితాలో 23వ స్థానం దక్కించుకున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు.