Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • అమరావతి: ESI స్కాం లో కొత్త ట్విస్ట్. స్కాం లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్. పితాని దగ్గర అప్పట్లో పీఎస్ గా పనిచేసిన మురళీ మోహన్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. వీటిపై విచారణ చేపట్టి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.
  • వికాస్ దూబే అరెస్టు వ్యవహారంలో కొత్త కోణాలు. కులాభిమానంతో వికాస్ దూబేకు ఓ ఎంపీ సహకారం. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎంపీ సహాయంతో లొంగుబాటు. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించేందుకే సహకారం.
  • పెరుగుతున్న కరోనాకేసుల్తో మార్కెట్లలో బెంబేలు . ఈనెల 12వ తేదీ నుండి కొత్తపేట్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను మూసివేత నిర్ణయం. మళ్లీ ప్రకటించే వరకూ రైతులు ఎవరు మార్కెట్ రావద్దని ప్రకటన. వేల సంఖ్యలో రైతులతో కిటకిట లాడే మార్కెట్లో నిబంధనలు పాటించడంలేదంటూ ఆందోళన. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో మూసివేత నిర్ణయం తీసుకున్న కమిటి. ప్రతి రోజు 5వందల నుంచి వేయి టన్నుల పండ్ల అమ్మకాలు . 250 మంది వ్యాపారులు...3వందల మంది హమాలీలతో ఉన్న గడ్డి అన్నారం మార్కెట్.
  • టీవీ9 తో స్కూల్స్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి . ప్రైవేటు పాఠశాల్లలో తనిఖీలు చేయవలసిందిగా 17 జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు . హైదరాబాద్, రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి . హైదరాబాద్ 6 , రంగారెడ్డి 11 పాఠశాలలకు నోటీసులు . నోటీసులకు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే స్కూల్స్ సీజ్ చేస్తాం . జీవో నెంబర్ 46 ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు . పేరెంట్స్, పేరెంట్స్ అసోసియేషన్ ల నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అధిక ఫీజులు, ల్యాబ్స్, యూనిఫామ్స్ ...వంటి వసూళ్లు చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి.
  • తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన: దక్షిణ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. సంచాలకులు హైదరాబాద్ వాతావరణ కేంద్రం

‘మా’లో మళ్లీ లొల్లి షురూ! నరేష్‌పై చర్యలు తీసుకోవాల్సిందే

MAA controversy: Jeevitha Rajasekhar slams President Naresh, ‘మా’లో మళ్లీ లొల్లి షురూ! నరేష్‌పై చర్యలు తీసుకోవాల్సిందే

‘మా’లో మళ్లీ లొల్లి షురూ అయ్యింది. మా అధ్యక్షుడు నరేష్‌పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా’ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, మాజీ అధ్యక్షుడు శివాజీరాజాపై నరేష్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. నరేష్ లోపాలను తప్పుబడుతూ క్రమశిక్షణ సంఘానికి 10 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో 15 మంది ఈసీ కమిటీ సభ్యులు కూడా సంతకం చేశారు. గతంలో శివాజీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు.. నరేష్ కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వారు ఏం చేశారో.. అంతా ఈ 10 పేజీల లేఖలో పేర్కొన్నామన్నారు.

దయచేసి క్రమ శిక్షణ సంఘం నరేష్‌ వ్యవహారంపై చర్చలు జరిపి సరైన చర్య తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేష్‌పై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ సంఘానికి జీవిత విజ్ఞప్తి చేశారు. నరేష్ తాను తీసుకుంటోన్న నిర్ణయాలతో ‘మా’ను పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నారని, మా సభ్యులు ఆస్పత్రిలో ఉంటే కనీసం పరామర్శ కూడా చేయలేదని వ్యాఖ్యానించారు జీవిత. కాగా.. డిసిప్లెయిన్ కమిటీలో ప్రముఖ సీనియర్ నటులు కృష్ణం రాజు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, జయసుధలు ఉన్నారు. దీనిపై మరి వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

MAA controversy: Jeevitha Rajasekhar slams President Naresh, ‘మా’లో మళ్లీ లొల్లి షురూ! నరేష్‌పై చర్యలు తీసుకోవాల్సిందే

Related Tags