Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

‘మా’ని ముసురుతోన్న విభేదాలు..ఎందుకు పదే, పదే పలచనవుతున్నారు..!

Jeevitha Rajasekhar Holds Meeting In Maa Association, ‘మా’ని ముసురుతోన్న విభేదాలు..ఎందుకు పదే, పదే పలచనవుతున్నారు..!

ఇటీవల కాలంలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌) తరచూ వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌ను శివాజీ రాజా ప్యానల్‌, నరేష్‌లు ప్యానల్‌లు ప్రతిష్టాత్మకంగా భావించటంతో ఆ ఎన్నికల జనరల్‌ ఎలక్షన్స్‌ను తలపించాయి. అయితే అనూహ్యంగా నరేష్‌ ప్యానల్‌ విజయం సాధించటంతో కొద్ది రోజుల పాటు గత కమిటీపై ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగాయి.

ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో ‘మా’ అసోషియేషన్‌లో మరో వివాదం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకే ప్యానల్‌ నుంచి పోటి చేసిన నరేష్‌, జీవిత రాజశేఖర్‌ల మధ్య ఇప్పుడు గొడవ రాజుకుంది. అధ్యక్షుడు నరేష్‌ లేకుండానే ఎక్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, సెక్రటరీ జీవితలు జనరల్‌ బాడీ మీటింగ్‌ను నిర్వహించారు. అత్యవసర సమావేశం జరుగుతుంది అంటూ సభ్యులకు మెసేజ్‌ చేయటంలో అంతా హజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకపోవటంతో ఆయన తరపు న్యాయవాది స్పదించారు. అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్‌ ఎలా నిర్వహిస్తారంటూ జీవిత రాజశేఖర్‌లను ప్రశ్నించాడు.

అయితే ఈ విషయంపై స్పదించిన రాజశేఖర్‌, జీవితలు ఇది ఫ్రెండ్లీ మీటింగ్‌ మాత్రమే.. కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదన్నారు. ఈ మీటింగ్‌లో గత తొమ్మిది నెలలో అధ్యక్షుడిగా నరేష్‌ తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు.

ఎవరి గ్రూపులు వారివే : పృథ్వీ

‘ఎన్నికలు ముగిసి 8 నెలలు పూర్తయ్యాయి. ప్రతి ఒక్కరూ ప్రెసిండెంట్‌ ఆఫ్‌ ఇండియాలా ఫీలవుతున్నారు. అందరూ కలసి పనిచేయండి. ఈసీ సభ్యులు 26 మంది ఉన్నారు. ఒక్కొక్కరూ పది మందిని దత్తత తీసుకుని తలా కొంచెం ఇవ్వండి. సమస్యల్లో ఉన్న వాళ్ల బాగోగులు చూడాలి కానీ ఇవేం గొడవలు. అత్యవసర సమావేశం అని తిరుపతి నుంచి వస్తే ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 400 సినిమాలకు రచయితగా పని చేసిన మా గురువు పరుచూరి గోపాలకృష్ణని కూడా మాట్లాడనివ్వలేదు. ఆయన సమస్కారం పెట్టినా అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా బాధాకరం. నాకు ఈసీ మెంబర్‌ పదవి అక్కర్లేదు. ‘మా’ తీరు మారకుంటే రాజీనామా చేస్తా. ఈసీ మెంబర్‌గా గెలిచినందుకు ఆనందపడాలో.. బాధపడాలో తెలియడం. ‘ మా’లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారు. మెంబర్లు కూడా ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు’ అని పేర్కొన్నారు పృథ్వీ.

ఎప్పటినుంచి ఈ విభేదాలు: 

మా అధ్యక్షుడిగా నరేష్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, జీవితా సెక్రటరీగా ఉన్నారు. గత మూడు నెలలుగా వీరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. రాజశేఖర్ తన అనకూలంగా ఉన్న 21మందితో కలిసి నరేష్‌కు నోటీసులు అందించినట్లుగా తెలుస్తోంది. గత 9నెలలుగా మాలో ఏం జరుగుతుంది ? ఎంత ఫండింగ్ అందింది? ఎలాంటి ఈవెంట్లు జరుగుతున్నాయి అన్న దానిపై జీవితా రాజశేఖర్ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. నరేష్, జీవితా రాజశేఖర్ మధ్య దూరం మరింత పెరుగుతోంది.

ఆ ఐదున్నర కోట్లు ఏమయ్యాయి?
మా కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలల అవుతున్నా ఇప్పటివరకు ఫండ్స్‌ కలెక్ట్‌ చేయలేదని ఆధ్యక్షుడు నరేశ్‌పై రాజశేఖర్‌ కార్యవర్గం గుర్రుగా ఉంది. అంతేకాకుండా మా లో ఉన్న మూల ధనం రూ. 5.5 కోట్లు ఏమయ్యాయని అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నారు. గతంలో మూల ధనాన్ని కదపకుండా ఈవెంట్స్‌ స్పాన్లర్ల ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేసిందని, కానీ నరేశ్‌  మూలధనం నుంచే ఖర్చులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రోజు ‘మా’లో ఏర్పడిన పరిస్థితిక నరేశే కారణమంటూ జీవిత రాజశేఖర్‌ కార్యవర్గం మండిపడుతోంది.

నరేశ్‌కు..మాజీ అధ్యక్షుడు శివాజీరాజాతోనూ విభేదాలు:ప్రస్తుత ‘మా’ అద్యక్షుడు నరేశ్‌కు..మాజీ అధ్యక్షుడు, గత ఎన్నికలలో ఓడిపోయిన శివాజీరాజాకు కూడా తారా స్థాయిలో విభేదాలు చెరరేగాయి. మెగాస్టార్ చిరంజీవితో జరిగిన ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కు వచ్చిన ఫండ్‌కు సంబంధించి నరేశ్..శివాజీరాజాపై ప్రశ్నోత్తరాలు స్పందించారు. విషయం శృతి మించడంతో అప్పట్లో ఇండస్ట్రీ పెద్దలు కలగజేసుకోని పరిస్థితిని చక్కదిద్దారు.

‘మా’గౌరవాన్ని కాపాడుదాం: కృష్ణంరాజు
కోర్డు ఆర్డర్‌ ప్రకారం ఇది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని ‘మా’ చీఫ్‌ అడ్వైజర్‌ కృష్ణంరాజు తెలిపారు. అంతేకాకుండా ఈ మీటింగ్‌కు వచ్చిన వారి చేత ఎలాంటి సంతకాలు పెట్టించమన్నారు. ఒకవేళ సంతకాలు పెట్టిదలచిన వారు పూర్తిగా విషయం గురించి చదివి సరియైనది అని భావిస్తేనే సంతకం పెట్టాలన్నారు. ఏ నిర్ణయమైనా అందరూ కలిసి చర్చించుకుని తీసుకోవాలన్నారు. 25 ఏళ్ల చరిత్ర కలిగిన ‘మా’ ఇప్పటివరకు అందరూ మెచ్చుకునేలా ఉందని, ఇకపై కూడా అలాగే గౌరవంగా ఉండాలని ఆశిస్తున్నట్లు కృష్ణంరాజు తెలిపారు.

చిరంజీవి కలగజేసుకుంటారా :

మెగాస్టార్ చిరంజీవి కలగజేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదా అంటే..అవుననే అంటున్నారు పలువురు పరిశీలకులు. గతంలో ఇటువంటి విభేదాలు చెలరేగినప్పుడు దర్శకుడు దాసరి నారాయణరావుగారు కలగజేసుకొని సమస్యకు పరిష్కారం చూపేశారు. ఆయన కాలం చేయడంతో..బాధ్యత తీసుకునేవాళ్లు లేక పదే, పదే విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కలగజేసుకోని ఈ ప్రాబ్లమ్స్‌కు ముగింపు పలుకుతారని అందరూ ఆశిస్తున్నారు.