మూకదాడులతో దిగజారుతున్న దేశ ప్రతిష్ట.. : ఆర్ఎస్ఎస్ చీఫ్

మూకదాడులతో దేశ ప్రతిష్ట దిగజారుతోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విచారం వ్యక్తం చేశారు. విజయదశమి దసర సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విదేశీ సంస్కృతికి అద్దం పడుతున్న ఈ దాడులు.. హిందూ సమాజానికి చేటు అని అభివర్ణించారు. కొన్ని మతాల మధ్య జరుగుతున్న ఈ దాడులు భయాందోళనలకు కారణమవుతున్నాయని అన్నారు. అయితే కొందరు కావాలనే దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. కులం, మతం, భాష, ప్రాంతాల వైవిధ్యాన్ని […]

మూకదాడులతో దిగజారుతున్న దేశ ప్రతిష్ట.. : ఆర్ఎస్ఎస్ చీఫ్
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 5:06 PM

మూకదాడులతో దేశ ప్రతిష్ట దిగజారుతోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విచారం వ్యక్తం చేశారు. విజయదశమి దసర సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విదేశీ సంస్కృతికి అద్దం పడుతున్న ఈ దాడులు.. హిందూ సమాజానికి చేటు అని అభివర్ణించారు. కొన్ని మతాల మధ్య జరుగుతున్న ఈ దాడులు భయాందోళనలకు కారణమవుతున్నాయని అన్నారు. అయితే కొందరు కావాలనే దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. కులం, మతం, భాష, ప్రాంతాల వైవిధ్యాన్ని కొందరు స్వప్రయోజనాలకు వాడుకోవడం వల్ల విభేదాలకు ఆజ్యం పోసినట్లవుతుందన్నారు. అలాంటి స్వార్థ శక్తుల కుట్రలను గుర్తించి అప్రమతం కావాలని.. అంతేకాదు అలాంటి శక్తులను తిప్పికొట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరు హింసకు తావులేకుండా శాంతియుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు చట్టానికి లోబడి నడుచుకోవాలన్నారు.

గత కొద్ది రోజులుగా “భారతీయత” అనే సిద్ధాంతంపై ప్రజల ఆలోచనా విధానంలో సానుకూలత పెరుగుతోందని.. కానీ, ఈ మార్పును కొన్ని స్వార్థ శక్తులు సహించలేకపోతున్నాయన్నారు. అంతేకాదు దేశ పటిష్ట నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలను ఈ శక్తులు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత సరిహద్దులు పటిష్ఠంగా ఉన్నాయని.. తీర ప్రాంతాల రక్షణపై మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ నిర్ణయంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. దేశ ప్రయోజనాలను పరిరక్షించగలదని నిరూపించిందని.. దీంతో ప్రజల్లో కూడా విశ్వాసం రెట్టింపయ్యిందని భగవత్ అన్నారు. గత నెలన్నర వ్యవధిలో ప్రభుత్వం అనేక ఉద్దీపన చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. అంతకుముందు నాగపూర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆయుధపూజలో భగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హెచ్‌సీఎల్‌ సంస్థ వ్యవస్థాపకుడు శివ నాడార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, నితిన్‌ గడ్కరీ, జనరల్‌ వి.కె.సింగ్‌, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!