అదృష్టం అంటే ఆ దంపతులదే.. మధ్యయుగం కాలం నాటి 66 విస్కీ బాటిళ్లు ఊరికే దొరుకుతాయా!

పాడుబడిన ఇంట్లో వెతికితే ఏం దొరుకుతుంది.. వారు వాడి పడేసిన వస్తువలు కానీ లేదంటే నగా, నట్రా దొరుకుతుంది. లేదంటే గుప్త నిధులు బయటపడవచ్చు. అంతకంటే ఏముండదు.

  • uppula Raju
  • Publish Date - 7:39 pm, Thu, 26 November 20

పాడుబడిన ఇంట్లో వెతికితే ఏం దొరుకుతుంది.. వారు వాడి పడేసిన వస్తువలు కానీ లేదంటే నగా, నట్రా దొరుకుతుంది. లేదంటే గుప్త నిధులు బయటపడవచ్చు. అంతకంటే ఏముండదు. కానీ ఇక్కడ ఓ దంపతులకు పూర్వ కాలం నాటి 66 విస్కి బాటిళ్లు దొరికాయి. అవి కూడా ఓ గోడలో దొరికాయి. ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమే. వివరాల్లోకి వెళితే..

న్యూయార్క్‌కు చెందిన నిక్ డ్రమ్మండ్, పాట్రిక్ బక్కర్ దంపతులు. వీరు ఈ ఇంటిని ఓ నటోరియస్‌ స్మగ్లర్‌ దగ్గర నుంచి కొనుగోలు చేశారు. వందేళ్ల నాటి ఇల్లు కావడంతో మరమత్తులు చేపించాలని భావించారు. తమకు అనుకూలంగా ఆధునికంగా మార్చుకోవాలని అనుకున్నారు. ఆ క్రమంలో క్షీణించిన ఇంటి గోడలను బాగు చేసేందుకు తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో వారికి మద్య నిషేధ యుగం కాలానికి చెందిన 66 విస్కీ బాటిళ్లు దర్శనమిచ్చాయి. వీటిని చూసి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తేరుకొని తమక లభించిన అద‌ృష్టానికి సంబరపడిపోయారు. బంగారం, వజ్రాలు దొరికినా ఇంతటి ఆనందాన్ని తాము పొందలేమని ప్రకటించారు. అంతేకాకుండా ఈ బాటిల్స్‌ని ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి వారి బంధువులతో పంచుకున్నారు. తమకు దక్కిన అదృష్టం గురించి కథలు కథలుగా చెప్పుకొని మురిసిపోతున్నారు. అంతేకాకుండా మందు అభిమానులు ఆ బాటిల్స్ కొనడానికి వీరిని సంప్రదిస్తున్నారని చెప్పుకొచ్చారు. విదేశీయులకు మందుపై ఉండే మక్కువ అలాంటిది. కానీ ఈ దంపతులు వాటిని వేళం వేయాలని అనుకుంటున్నారట.