చైనా.. వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేత.. అయితే….?

కరోనా వైరస్ పుట్టినట్టు భావిస్తున్న వూహాన్ సిటీలో రెండు నెలల పాటు అమలు చేసిన లాక్ డౌన్ ని బుధవారం ఎత్తివేశారు. కోటీ 10 లక్షల జనాభా గల ఈ నగరంలో గత జనవరి 23 న లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సిటీలో సుమారు 50 వేల మందికి కరోనా వైరస్ సోకగా రెండున్నర వేల మంది మృతి చెందారు. ఇన్నాళ్లకు ఈ సిటీలో మళ్ళీ క్రమంగా సాధారణ స్థితులు నెలకొంటున్నాయి. గత మార్చి 28 […]

చైనా.. వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేత.. అయితే....?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 08, 2020 | 6:22 PM

కరోనా వైరస్ పుట్టినట్టు భావిస్తున్న వూహాన్ సిటీలో రెండు నెలల పాటు అమలు చేసిన లాక్ డౌన్ ని బుధవారం ఎత్తివేశారు. కోటీ 10 లక్షల జనాభా గల ఈ నగరంలో గత జనవరి 23 న లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సిటీలో సుమారు 50 వేల మందికి కరోనా వైరస్ సోకగా రెండున్నర వేల మంది మృతి చెందారు. ఇన్నాళ్లకు ఈ సిటీలో మళ్ళీ క్రమంగా సాధారణ స్థితులు నెలకొంటున్నాయి. గత మార్చి 28 నుంచే ఇక్కడికి ఇతర ప్రాంతాలనుంచి ప్రజలను అనుమతిస్తున్నారు. ఆంక్షలు పరిమితంగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు. మార్చి30 న  షాపింగ్ మాల్స్ ప్రారంభం కాగా.. సూపర్ మార్కెట్ల వద్ద వినియోగదారులు తమ మధ్య ఒక మీటరు దూరం ఉండేలా నిలబడి బార్లు తీరుతున్నారు. కొందరు అప్పుడే ఔట్ డోర్ బ్యాడ్మింటన్, డ్యాన్స్ వంటి ‘కార్యక్రమాల్లో’ బిజీ అవుతున్నారట. గత 21 రోజుల్లో ఇక్కడ కేవలం మూడు, గత రెండు వారాల్లో రెండు మాత్రమే ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. అయితే చిక్కల్లా.. రష్యా సరిహద్దుల్లోని హీలాంగ్జియాంగ్, సూఫెనె అనే చిన్న పట్టణాలతోనే వఛ్చి పడింది. ఇంపోర్టెడ్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ టౌన్లలో ఇలాంటి కేసులు పెరగడంతో.. లాక్ డౌన్ విధించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, కుటుంబంలో ఒక్కరు మాత్రమే మూడు రోజులకొకసారి బయటికి వెళ్లి తమకు అవసరమైన నిత్యావసరాలు తెచ్చుకుని తిరిగి అదే రోజున ఇళ్లకు రావాలని అధికారులు ఆదేశించారు.

కాగా-వూహాన్ సిటీ అంటే అప్పుడే ప్రభుత్వానికి భయం మాత్రం తొలగడంలేదు. ఆ నగరం నుంచి రాజధాని బీజింగ్ కి వచ్ఛేవారు తప్పనిసరిగా రెండు దఫాల టెస్టింగ్  చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?