కల్లోల కశ్మీర్‌లో ధోని గస్తీ!

మిస్టర్ కూల్ ధోనీ..క్రికెట్‌కు కొన్నాళ్లు విరామం చెప్పి భారత ఆర్మీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.   దేశానికి పలు చారీత్రాత్మక ట్రోఫీలను అందించిన మహీ..ఇప్పుడు సరిహద్దుల్లో నిలబడి కూడా అదే పోరాట పటిమను చూపుతున్నారు. ఒక పక్క కశ్మీర్‌లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది.  ఆర్టికల్‌ 35ఏ, ఆర్టికల్‌ 370లలో మార్పులు చేయవచ్చనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో లోయ మొత్తం నివురు గప్పిన నిప్పులా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత భద్రత మధ్య కూడా రాజకీయ నాయకులు, ప్రముఖులను […]

కల్లోల కశ్మీర్‌లో ధోని గస్తీ!
Follow us

|

Updated on: Aug 04, 2019 | 5:24 PM

మిస్టర్ కూల్ ధోనీ..క్రికెట్‌కు కొన్నాళ్లు విరామం చెప్పి భారత ఆర్మీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.   దేశానికి పలు చారీత్రాత్మక ట్రోఫీలను అందించిన మహీ..ఇప్పుడు సరిహద్దుల్లో నిలబడి కూడా అదే పోరాట పటిమను చూపుతున్నారు. ఒక పక్క కశ్మీర్‌లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది.  ఆర్టికల్‌ 35ఏ, ఆర్టికల్‌ 370లలో మార్పులు చేయవచ్చనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో లోయ మొత్తం నివురు గప్పిన నిప్పులా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత భద్రత మధ్య కూడా రాజకీయ నాయకులు, ప్రముఖులను అక్కడకు రావద్దని హెచ్చరికలు ఉన్నాయి. పలు దేశాలు ఆ ప్రాంతంలో ఉన్న వారి పౌరులను సైతం వెనక్కి వచ్చేయాలని పిలుపునిచ్చాయి.

అటువంటి చోట భారత ఏస్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఎటవంటి బెణుకు లేకుండా విధుల్లో చేరారు. ఎటువంటి మినహాయింపులు లేకుండా తన ర్యాంక్‌ అధికారులు నిర్వహించే విధులనే ఆయన కూడా నిర్వహిస్తున్నారు. ధోనీ టెరిటోరియల్‌ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌గా చేరిన విషయం తెలిసిందే. ఆయన గురువారం నుంచి తన సాధారణ విధుల్లో పాల్గొంటున్నారు. వాస్తవానికి ఆయనకు గౌరవ లెఫ్టినెంట్‌ హోదాను సైన్యం కల్పించింది. ఈ హోదాలో ఉంటే వారికి సాధారణ విధులు అప్పగించరు. ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి.   కానీ, ధోని కొన్ని నెలల క్రితం సైన్యానికి లేఖ రాస్తూ.. తనకు సాధారణ విధులు కూడా అప్పగించాలని కోరడంతో పాటు ప్రత్యేక సదుపాయాలు ఏమి వద్దని తెలిపారు. దీంతో ఈసారి ఆయనకు అత్యంత సమస్యాత్మకమైన శ్రీనగర్‌లో గస్తీ విధులను అప్పగించారు. ఈ క్రమంలో ఆయన సాధారణ జవాన్లకు కేటాయించే బ్యారాక్‌ల్లోనే ఉంటున్నారు. అందరి వలే ఉదయం 5 గంటలకు  నిద్రలేచి దినచర్యను ప్రారంభిస్తున్నారు. సాధారణ జవాన్లతోపాటే కలిసి భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం 106 టీఏ పార బెటాలియన్‌లో ఆగస్టు 15 వరకు ధోనీ విధులు నిర్వహించనున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..