ముంచుకొస్తున్న అల్పపీడనం… మరో మూడు రోజులు వర్షాలు

వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

ముంచుకొస్తున్న అల్పపీడనం... మరో మూడు రోజులు వర్షాలు
Follow us

|

Updated on: Oct 04, 2020 | 5:00 AM

Rainfall Telangana : తెలుగు రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి. ఎన్నడూ లేనన్ని వర్షాలు ఈ ఏడాది కురిసినట్లుగా ప్రభుత్వ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే మరో మూడు రోజులపాటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ మూడింటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆది, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.