మరో అల్పపీడనం..

low pressure in bay of bengal

బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీని ప్రభావం ఈశాన్య ప్రాంతంలో 3. 1 కిలో మీటర్ల ఎత్తున ఉపరిత ఆవర్తనం ఉందని అధికారులు వెల్లడించారు. దీనివల్ల భారీ నుంచి అతిభారీ వర్షలు కురిసే అవకాశాలున్నట్టు అధికారుల హెచ్చరించారు.

ఒడిషా, కర్ణాటక రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేవు. ప్రస్తుతం వాతారణం పొడిగానే ఉంది. ఇవాళ అల్పపీడనం ఏర్పడితే పరిస్థితి మళ్లీ మారవవచ్చని వాతారణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు కురిసిన వర్షాలతో వాగులు , వంకలు, నదులు పొంగి ప్రవహిస్తుండగా ఎక్కడిక్కడే జనజీవనం స్థంభించి పోయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *