వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. కోస్తాంధ్రాకు వర్ష సూచన.!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

  • Ravi Kiran
  • Publish Date - 9:26 pm, Wed, 21 October 20
Rains For Andhra Pradesh

 Rains For Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం దిశను మార్చుకుని దక్షిణ ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరం వైపు మళ్లిందని తెలిపింది. అంతేకాకుండా రేపు సాయంత్రం బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది.

దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 6500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.!