Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 28,637 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్ ని మోసం చేసిన కేసులో ఉన్నతాధికారులు సీరియస్. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఏవిధంగా ప్రభుత్వానికి విక్రయించారంటూ ఆరా తీస్తున్న అధికారులు. ఇప్పటికే ప్రారంభమయిన పోలీసు దర్యాప్తు.
  • విజయవాడ: ఆత్రేయపురం ప్రేమకథ సినిమా పేరుతో మోసం. చైతన్య క్రియేషన్ బ్యానర్ పై సినిమా అంటూ యువతులకు వల. అమరావతి శివక్షేత్రంలో సినిమా ప్రారంభం అంటూ రిబ్బన్ కటింగ్ చేసిన గుంటూరు జిల్లాకు చెందిన రెంవత్ బిక్షా . విజయవాడ, గుంటూరు జిల్లాకు చెందిన యువతులను హీరోయిన్లుగా చేస్తానంటూ చీటింగ్.
  • తిరుపతి.... డయిల్ యువర్ ఈఓ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.... శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకుంటాం. నిధులు దుర్వినియోగం కానీయం. నెలరోజుల్లో 16.73 కోట్లు శ్రీవారికి హుండీ ద్వారా ఆదాయం లభించింది.
  • ఆత్రేయపురం ప్రేమకథ దర్శకుడు దేవరాయ రమేష్ అలియాస్ రవితేజ అలియాస్ రావణ్ బిక్షూ. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలి. ఆధారాలు టివి9 కే అందించాలి. ఎటువంటి కేసులు ఎదుర్కోవటానికైనా సిద్దంగా ఉన్నా. నా దగ్గర స్ర్కిప్టు తీసుకెళ్ళిన కో డైరెక్టర్ భార్గవి నాపైనే ఆరోపణలు చేస్తోంది. హీరో, ఇతర ఆర్టిస్ట్ లతో ఫోన్ లో మాట్లాడిన రావణ్ భిక్షూ.
  • హైదరాబాద్ లో మాయమైన సండే సందడి. చాలా ఏరియా లలో కనిపిస్తున్న కర్ఫ్యూ వాతావరణం . షాపులు...మాల్స్ ..రెస్టారెంట్లు..తెరిచి ఉన్నా కన్పిపించని పబ్లిక్. ఆదివారం మార్కెట్ లలో సైతం అనంతం మాత్రం గానే కొనుగోలుదారు. కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న కరోనా భయం. ఇళ్లకే పరిమితం అవుతున్న జనం. హైదరాబాద్ లో పెరుగుతున్న అధిక కేసులతో ... అలర్ట్ అయిన పబ్లిక్.
  • నగరంలో మరొకసారి ఆక్సిజన్ సిలిండర్ల పట్టివేత. ముషీరాబాద్ లో 34 సిలెండర్లని ఆక్సిజన్ సిలిండర్ ను సీజ్ చేసిన అధికారులు. అనుమతులు లేకుండా సిలిండర్ విక్రయిస్తున్న బాబా ట్రేడర్స్. అధిక ధరకు సిలిండర్లను అమ్ముతున్న సర్దార్ ఖాన్ ను అరెస్టు చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు.

ముంబైలో దారుణం: ఆక్సిజన్ కొరతతో.. ఏడుగురు కరోనా రోగులు మృతి..

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. అర్తకవ్యవస్థలు అతలాకుతలమయ్యాయి.కరోనావైరస్
Coronavirus In Maharashtra, ముంబైలో దారుణం: ఆక్సిజన్ కొరతతో.. ఏడుగురు కరోనా రోగులు మృతి..

Coronavirus In Maharashtra: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. ఆర్థికవ్యవస్థలు అతలాకుతలమయ్యాయి.కరోనావైరస్ సంక్రమణ ముంబైలోని అనేక ఆసుపత్రులలో భయాందోళనలకు గురిచేస్తోంది. స్థానిక జోగేశ్వరి ఆసుపత్రిలో కరోనాకు సోకిన ఏడుగురు కేవలం 2 గంటల వ్యవధిలో మరణించారు. అయితే విచారణ చేయగా, దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు బయటపడ్డాయి.

వివరాల్లోకెళితే.. ఏడుగురు కోవిద్ఆ-19 రోగులు ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో మరణించినట్లు తేలింది. గత వారం సమయంలో ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా 12 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. సీనియర్ వైద్యుల కొరత ఎక్కువగా ఉందని, అందుకే కరోనా రోగులపై పర్యవేక్షణ చేయడం కుదరడం లేదని ఇతర వైద్య సిబ్బంది చెబుతున్నారు. కేవలం గంటన్నర వ్యవధిలో 7 మంది రోగులు మరణించారని తెలుస్తోంది.

కాగా.. కోవిద్-19 రోగుల పరిస్థితి విషమంగా ఉండటంతో, నర్సులు వెంటనే వైద్యుడికి సమాచారం ఇచ్చారు. ఐసియులో టెక్నీషియన్ సహాయంతో ఆక్సిజన్ స్థాయిని సరిచేసే సమయానికి, రోగులు మరణించారు. ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది.మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మానే తెల్లవారుజామున 4:30 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించారు. అయితే, ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల రోగులు మరణించడాన్ని డాక్టర్ ఖండించారు.

Also Read: త్వరలో.. మార్కెట్లోకి కరోనావైరస్ టెస్ట్ కిట్.. 10 నిమిషాల్లో ఫలితం.. 

 

Related Tags