కిలాడీ ప్రేమికులు..జంటగా మోసాలు

అ ఇద్దరు ప్రేమించుకున్నారు…ఇంతవరకు బాగానే ఉంది..అయితే, అవసరాలకు కావాల్సిన డబ్బు కోసం ఆ ఇద్దరూ జంటగా మోసాలు చేయటం అలవర్చుకున్నారు. ప్రియుడు చెప్పిన పథకం ప్రకారం తూ.చా తప్ప కుండా నమ్మిన వారందరినీ మోసం చేయటం పనిగా పెట్టుకుంది ఆ ప్రియురాలు. చివరకు బాధితుల ఫిర్యాదుతో ఇద్దరూ కటకటా పాలయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా కైకలూరు మండలానికి చెందిన బాలయోగి, సంగం మండలం దువ్వూరు […]

కిలాడీ ప్రేమికులు..జంటగా మోసాలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2019 | 6:08 PM

అ ఇద్దరు ప్రేమించుకున్నారు…ఇంతవరకు బాగానే ఉంది..అయితే, అవసరాలకు కావాల్సిన డబ్బు కోసం ఆ ఇద్దరూ జంటగా మోసాలు చేయటం అలవర్చుకున్నారు. ప్రియుడు చెప్పిన పథకం ప్రకారం తూ.చా తప్ప కుండా నమ్మిన వారందరినీ మోసం చేయటం పనిగా పెట్టుకుంది ఆ ప్రియురాలు. చివరకు బాధితుల ఫిర్యాదుతో ఇద్దరూ కటకటా పాలయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా కైకలూరు మండలానికి చెందిన బాలయోగి, సంగం మండలం దువ్వూరు గ్రామంలో చేపల గుంటలు లీజుకు తీసుకుని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన నాగచంద్రిక అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇదిలా ఉండగానే బాలయోగికి చేపల గుంటలతో నష్టం వచ్చింది. చేతిలో డబ్బులు లేకుండా పోయింది. జల్సాలకు అలవాటు పడిన ఆ ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు..దీంతో బాలయోగి ప్రియురాలితో కలిసి మోసాలు చేసేందుకు పథకం వేశాడు. గ్రామంలో నీకు తెలిసిన వారికి మత్తు పదార్థాలు ఇచ్చి నగదు, బంగారం  చోరీ చేసుకురమ్మని చెప్పాడు. నిద్రమాత్రలు పొడిగా చేసి ఇచ్చి పంపాడు. అతడు చెప్పిన మాట ప్రకారం తెలిసిన ఓ మహిళ ఇంటికి వెళ్లి దేవుని ప్రసాదం అని చెప్పి మత్తు కలిపిన పదార్థం తినిపించింది కిలాడీ ప్రేమికురాలు. దీంతో ఆ మహిళ స్పృహా కొల్పోయింది. వెంటనే ఆమె ఒంటి మీదున్న బంగారం, ఇంట్లో ఉన్న నగదు చోరీ చేసి తీసుకెళ్లి ప్రియుడు బాలయోగికి ఇచ్చింది ప్రియురాలు నాగచంద్రిక. బాధితురాలు మత్తు నుండి తేరుకున్నాక జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సంగం పోలీసులు ప్రేమ జంటను అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుండి 8 తులాల బంగారం, 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు.