ప్రియురాలి కొడుకు, కూతురు ఫోన్లకు పర్సనల్ ఫోటోలు పంపిన ప్రియుడు..

అక్రమ సంబంధానికి బ్రేక్ చెప్పిందనే కోపంతో తాను, తన మాజీ ప్రియురాలు సాన్నిహిత్యంగా ఉన్న పోటోలను ఆమె కూతురు, కొడుకు ఫోన్లకు పంపించాడు ఓ ప్రబుద్ధుడు.

  • Shiva Prajapati
  • Publish Date - 10:21 pm, Sat, 28 November 20

అక్రమ సంబంధానికి బ్రేక్ చెప్పిందనే కోపంతో తాను, తన మాజీ ప్రియురాలు సాన్నిహిత్యంగా ఉన్న పోటోలను ఆమె కూతురు, కొడుకు ఫోన్లకు పంపించాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల అంబవాడి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంది. ఓ క్యాటరింగ్ ఏజెన్సీని నడుపుతూ జీవనం సాగిస్తుంది. అయితే, ఏడాదిన్నర క్రితం మితేశ్ పర్మర్ అనే వ్యక్తితో మహిళకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే తాను తప్పు చేస్తున్నానని భావించిన సదరు మహిళ అతనితో రిలేషన్ తెంచుకోవాలని నిర్ణయించింది. అతన్ని దూరంగా పెట్టింది. అయితే దీనికి ఆగ్రహించిన అతను బాధిత మహిళ కూతురు, కుడుకు ఫోన్లకు వారు సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను పంపించాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పర్మర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.