Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

పాస్‌పోర్ట్‌లపై కమలం గుర్తు అందుకే: విదేశాంగ శాఖ క్లారిటీ

BJP Election Symbol on Indian Passports, పాస్‌పోర్ట్‌లపై కమలం గుర్తు అందుకే: విదేశాంగ శాఖ క్లారిటీ

కొత్త పాస్‌పోర్టులపై బీజేపీ గుర్తు(కమలం) ముద్రిస్తున్నారంటూ ఇటీవల కొన్ని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో వీటిపై విదేశాంగ శాఖ స్పందించింది. జాతీయ చిహ్నాల్లో ఒకటైన కమలం గుర్తును కొత్త పాస్‌పోర్టులపై ముద్రించామని విదేశాంగ తెలిపింది. లోక్‌సభ ఈ విషయంపై రచ్చ జరిగిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఎట్టకేలకు వివరణ ఇచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా ఫేక్ పాస్‌పోర్టుల సమస్యను అధిగమించడం కోసమే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కమలం గుర్తును ముద్రించామని.. రొటేషన్ పద్ధతిలో మిగిలిన జాతీయ చిహ్నాలను కూడా ముద్రిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తును ముద్రించిన విషయమై లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళలోని కోళికోడ్‌లో ఈ పాస్‌పోర్టులను చేస్తున్నారని ఆయన కేంద్రంపై విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్.. కమలం అన్నది జాతీయ చిహ్నాల్లో ఒకటని.. అదనపు భద్రతా చర్యల్లో భాగంగా ఈ జాతీయ చిహ్నాన్ని ముద్రించామని అన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ భద్రతా చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. ఇక వచ్చే నెలలో మరో జాతీయ చిహ్నాన్ని ముద్రిస్తామని రవీష్ కుమార్ స్పష్టం చేశారు.