Breaking News
  • నల్గొండ: ధర్మారెడ్డిపల్లి కాల్వను పూర్తిచేసి రైతులకు నీరు ఇవ్వాలి. రైతుల ఆత్మహత్యలలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తేనే సీఎం అని అనిపించుకుంటారు. రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • కరీంనగర్‌: అల్గునూర్‌ బ్రిడ్జి పైనుంచి పడ్డ కారు. కారులో ప్రయాణిస్తున్న భర్త మృతి, భార్యకు గాయాలు. కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌కు గాయాలు. మృతుడు కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తింపు. కొమురవెళ్లి జాతరకు వెళ్తుండగా ఘటన.
  • సిద్దిపేట: జగదేవపూర్‌లో ఉద్రిక్తత. చైర్మన్‌ పదవి కోసం రెండువర్గాలుగా చీలిన టీఆర్‌ఎస్. ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ. శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం. అడ్డుకున్న పోలీసులు.
  • చెన్నై: విల్లుపురం జిల్లా సెంజిలో అగ్రవర్ణాల దాష్టీకం. పొలాల్లో మల విసర్జన చేశాడని యువకుడిని కొట్టిన అగ్రవర్ణాల పెద్దలు. యువకుడికి తీవ్రగాయాలు, పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. గాయాలతో ఉన్న యువకుడిని ఇంటికి పంపిన పోలీసులు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే యువకుడు మృతి. కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆందోళన. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌.
  • బాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ దాడులపై రాజకీయ రచ్చ. వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు. ట్విట్టర్‌లో చంద్రబాబుపై విజయసాయి ధ్వజం. కౌంటర్‌ ఎటాక్‌ చేసిన టీడీపీ నేతలు. శ్రీనివాస్‌ కమిట్‌మెంట్‌ను మెచ్చుకోవాలి. యజమాని ప్రతి లావాదేవీని డైరీలో రాసుకున్నాడు. దోచుకున్నవి, దొంగ లెక్కలను పర్‌ఫెక్ట్‌గా రికార్డ్‌ చేశాడు-విజయసాయి. దోపిడీదారులు నిప్పుకణికల్లా బిల్డప్‌ ఇస్తుంటారు-విజయసాయి. టీడీపీపై దుష్ప్రచారం చేస్తే చట్టపర చర్యలు-యనమల. ఐటీ దాడులను భూతద్దంలో చూపించారు-యనమల. రూ.2 వేల కోట్ల నగద అని ప్రచారం చేశారు. చంద్రబాబుకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలి-యనమల. శ్రీనివాస్‌ ఇంట్లో వేల కోట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారు-బుచ్చయ్య. వైవీ సుబ్బారెడ్డి మైనింగ్‌లపై విచారణ చేయాలి-బుచ్చయ్య.

Lottery : వారెవ్వా.. రైతు కూలీకి తగిలిన రూ.12 కోట్ల లాటరీ..

Lottery Kerala lottery result: Kannur labourer wins Rs 12 crore lottery, Lottery : వారెవ్వా.. రైతు కూలీకి తగిలిన రూ.12 కోట్ల లాటరీ..

ఆయన ఓ రైతు కూలీ. పని ఉంటేనే పూట గడుస్తోంది. ఇప్పటికే గతంలో చేసిన లోన్లు వెంటాడుతున్నాయి. బ్యాంకు వాళ్లు అప్పులు చెల్లించకపోతే ఇల్లు జప్తు చేస్తామని తిరుగుతున్నారు. కట్ చేస్తే.. ఊహించని విధంగా అదే రైతు కూలీ ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయ్యాడు. అవును అతనికి లాటరీ తగిలింది. అది కూడా 1 కాదు, 2 కాదు..ఏకంగా రూ. 12 కోట్లు. గిప్ట్ ట్యాక్సులు అన్నీ పోగా అతడికి చేతికి నిఖరంగా రూ. 7.2 కోట్లు అందనుంది.

వివరాల్లోకి వెళ్తే..కేరళలోని కన్నూరలో నివశించే రాజన్ (58) రైతు కూలీగా పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఓ అలవాటు ఉంది. అదే లాటరీలు తీయడం. ఏ రోజైనా ఈ పేదవాడ్ని లక్ష్మీదేవీ కనికరించకపోతుందా అని ఆయన ఆశ. అందుకే తనకు వచ్చే కూలి డబ్బులో ఎక్కువ మొత్తాన్ని లాటరీలు తీయడానికే ఖర్చపెడతాడు. ఇప్పటివరకు ఆయన మూడు సార్లు మాత్రమే..రూ.500 చొప్పున లాటరీలు గెలిచారు. ఇటీవల అలవాటులో భాగంగా క్రిస్మస్ సందర్భంగా కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాటరీ స్కీమ్‌‌లో టికెట్ కొన్నాడు రాజన్. ఊహించని విధంగా ఆయనకు ఈ సారి లక్ కలిసొచ్చి రూ. 12 కోట్లు టికెట్ తగిలింది. దీంతో రాజన్‌తో పాటు ఆయన కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఎక్కువ అమౌంట్ గెలవాలని రాజన్ ప్రతిరోజు 5 టికెట్లు కొనుగోలు చేసేవాడినని తెలిపాడు. వచ్చిన డబ్బుతో ముందుగా తనకున్న రూ. 5 లక్షల అప్పు తీరుస్తానని.. ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు.