Breaking News
  • రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటంలేదని అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
  • ముంబై దాదార్‌లోని శుష్రుషా ఆస్పత్రి నర్సులందరినీ క్వారంటైన్‌కు తరలింపు. ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో చర్యలు. కొత్తగా రోగులెవరినీ చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసిన అధికారులు. ఇప్పటికే ఉన్న రోగులను 48 గంటల్లో డిశ్చార్జి చేయాలని ఆదేశాలు. క్వారంటైన్ చేసిన నర్సులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిందిగా ఆదేశం.
  • కరోనా నుంచి పూర్తిగా కొలుకోక ముందే కొత్తగూడెం డిఎస్పీ డిశ్చార్జి.. అదే పేరుతో ఉన్న మరోవ్యక్తికి నెగిటివ్ రావటం తో డిఎస్పీ డిశ్చార్జి.. రిపోర్టులో డిఎస్పీకి పాజిటివ్ అని తేలటంతో మళ్ళీ వెనక్కి రప్పిస్తున్న వైద్యులు.. నిన్న ఇంటికి వెళ్లినా డిఎస్పీ క్వారంటైన్ లొనే ఉన్నారు..
  • కరోనాతో బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ కుట్ర. కుట్రను భగ్నం చేసిన బిహార్ పోలీసులు. నేపాల్ సరిహద్దుల ద్వారా కరోనా పాజిటివ్ ఉగ్రవాదులను భారత్‌కు పంపే అవకాశం. తద్వారా వైరస్ విస్తృతి చేయాలన్నది పాక్ కుట్రగా అనుమానం.
  • కరోనా ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాయమందించిన మై హోం గ్రూప్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి 3 కోట్ల రూపాయల చెక్ ని అందించిన మై హోం ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్ జూపల్లి రంజిత్ రావు.

సముద్రంలో 28 రోజులు..సినిమాను మించిన ట్విస్టులు…

An Andaman man Reached ashore in Odisha after 28 days, సముద్రంలో 28 రోజులు..సినిమాను మించిన ట్విస్టులు…

లైఫ్ అఫ్ పై..  అనే సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఒక టీనేజ్‌లో ఉండే యువకుడు..అనివార్య కారణాల వల్ల నాటుపడలో నడిసముద్రంలో చేసిన ప్రయాణం..ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సమయంలో ప్రాణాన్ని నిలుపుకోడానికి అతడు చేసే ప్రయత్నాలు ఔరా అనిపిస్తాయి. అలాంటి జర్నీ రియల్ లైఫ్‌లో ఊహించుకోగలమా..?. కానీ ఓ వ్యక్తి అటువంటి దురదృష్టవశాత్తూ అటువంటి ప్రయాణమే చేశాడు.

అండమాన్‌కు చెందిన సదరు వ్యక్తి నడి సముద్రంలో చిక్కుకొని 28 రోజులు బ్రతుకుతో యుద్దం చేసి చివరికి ఒడిశా తీరానికి చేరుకున్నాడు. అండమాన్‌ నుంచి తనతోపాటు వచ్చిన మరో వ్యక్తి మధ్యలోనే చనిపోగా, శుక్రవారం ఒడిశాలోని ఖిరిసాహి అనే తీర గ్రామానికి అతను ఉన్న పడవ కొట్టుకొచ్చింది. అండమాన్‌ నుంచి ఒడిశా తీరం 1300 కిలోమీటర్లు కావడం ఆశ్చర్చపరిచే అంశం.

వివర్లాలోకి వెళ్తే..  అమృత్‌ కుజుర్‌ (49) అనే వ్యక్తి తన స్నేహితుడు దివ్యరాజన్‌తో కలిసి సెప్టెంబరు 28న సముద్రంలోకి బయలుదేరాడు. వివిధ సరకులు, తాగునీటిని సముద్రంలో వచ్చిపోయే నౌకలకు విక్రయించే వ్యాపారం వారిది. ఇలా రూ.5 లక్షల విలువైన సరకులతో ఓ మర పడవలో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని షాహిద్‌ ద్వీప్‌ నుంచి బయలుదేరాడు. ఈ లోపు తుపాను రావడంతో తమ మర పడవ గతి తప్పిపోయింది. ఇంధనం అయిపోవడమేకాక, పడవ పైభాగం దెబ్బతింది. సాయం కోరడం కోసం వారి వద్ద ఉన్న కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా పాడైంది. దీంతో పడవలో బరువు తగ్గించుకోవాలని వారు తీసుకొచ్చిన సరకులన్నింటినీ సముద్రంలో పారేశారు.

సాయం కోసం వారి అరిచిన అరుపులు సముద్రపు హోరులో దగ్గర్లో వెళ్తున్న ఏ నౌకకి వినిపించలేదు.  చివరికి బర్మాకు చెందిన ఓ నౌకాదళ ఓడ వారి వద్దకు వచ్చి 260 లీటర్ల డీజిల్‌, కంపాస్‌ ఇచ్చి సాయం చేసింది. ఇంటి ముఖం పడుతున్న సమయంలో బంగాళాఖాతంలో వారు మరో తుపాను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాకాసి గాలులకు వారి మర పడవ మరింత దెబ్బతింది. భారీ అలలకు నీళ్లు లోపలికి చేరాయి. ఇంజిన్‌ ఆన్‌లోనే ఉంచడంతో అదృష్టవశాత్తు పడవ బోల్తా పడలేదు. ఈ ప్రయాణంలో ఒకరు చనిపోగా..మరోక వ్యక్తి బ్రతకుజీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.

An Andaman man Reached ashore in Odisha after 28 days, సముద్రంలో 28 రోజులు..సినిమాను మించిన ట్విస్టులు…

”మాకు తిండి, నీరు లేక నీరసించిపోయాం. నా స్నేహితుడు దివ్యరాజన్‌ కొద్ది రోజులకు మరణించాడు. నేను కూడా వర్షపు నీటిని తువ్వాలుతో ఒడిసి పట్టి తాగాను. స్నేహితుడి మృతదేహం రెండు రోజులు బోటులోనే ఉంచినా, అది కుళ్లిపోతుండడంతో సముద్రంలో పడేయాల్సి వచ్చింది. నేను కూడా చనిపోతానని అనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల బతికాను” అని కుజుర్‌  తన భయంకర జర్నీని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Related Tags