అమెజాన్ దెబ్బకు.. తెలుగు సినిమా విలవిల!

డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ‘అమెజాన్ ప్రైమ్’కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొత్త సినిమాలను రిలీజైన నెల రోజులలోపే ప్రేక్షకులకు అందిస్తూ విశేష ఆదరణ పొందుతోంది. ఇది ఇలా ఉంటే సినిమా కలెక్షన్స్‌కు దెబ్బ పడుతోందని టాలీవుడ్ పెద్దలు అమెజాన్ ప్రైమ్‌లో సినిమాను కాస్త లేట్‌గా రిలీజ్ చేస్తే.. జనాలు థియేటర్‌కు వస్తారని భావించి ఓ డెసిషన్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారు అయింది. ఆడియన్స్‌కు టాలీవుడ్ నిర్మాతలు కొత్త యాంగిల్‌లో దెబ్బకొట్టడంతో వారు రూట్ […]

  • Ravi Kiran
  • Publish Date - 5:55 pm, Tue, 21 May 19

డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ‘అమెజాన్ ప్రైమ్’కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొత్త సినిమాలను రిలీజైన నెల రోజులలోపే ప్రేక్షకులకు అందిస్తూ విశేష ఆదరణ పొందుతోంది. ఇది ఇలా ఉంటే సినిమా కలెక్షన్స్‌కు దెబ్బ పడుతోందని టాలీవుడ్ పెద్దలు అమెజాన్ ప్రైమ్‌లో సినిమాను కాస్త లేట్‌గా రిలీజ్ చేస్తే.. జనాలు థియేటర్‌కు వస్తారని భావించి ఓ డెసిషన్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారు అయింది. ఆడియన్స్‌కు టాలీవుడ్ నిర్మాతలు కొత్త యాంగిల్‌లో దెబ్బకొట్టడంతో వారు రూట్ మార్చారు.

అసలు విషయంలోకి వెళ్తే ఈ మధ్య ఏ స్టార్ హీరో కొత్త సినిమా రిలీజైన టాలీవుడ్ నిర్మాతలు టికెట్ ధరలను వారం రోజులు పాటు పెంచేసి కలెక్షన్స్ కోసం అదనపు భారాన్ని ప్రేక్షకుల మీద నెట్టేస్తున్నారు. టికెట్ ధర 200 రూపాయలు…  థియేటర్ పార్కింగ్.. ఇక ఇంటర్వెల్‌లో తిను బండారాలు ఇలా అన్ని కలుపుకుంటే ఓ మధ్య తరగతి వ్యక్తికి చాలా ఇబ్బందే. అందుకే ఆ డబ్బులు వాళ్ళు ఇంటర్నెట్ కనక్షన్‌కు పెట్టేసి, అమెజాన్ ప్రైమ్ కొనుక్కొని.. ఇంచక్కా ఇంట్లో కూర్చుని కుటుంబంతో పాటుగా సినిమాలు చూసేస్తున్నారు.

సమ్మర్‌లో రిలీజైన ‘మజిలీ’, ఆ తర్వాత వచ్చిన ‘చిత్రలహరి’ బాగున్నాయి అని అనుకునేలోపే.. ప్రైమ్‌లో వచ్చేశాయి. ఇక ‘మహర్షి’ అయితే పెద్ద సినిమా కాబట్టి జనం థియేటర్లకు వస్తున్నారు. అలాగే ఇదే టైంలో వచ్చిన ఇతర సినిమాల గురించి జనాల్లో టాక్ ఏంటంటే… ఓ నాలుగు వారాలు ఆగితే అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేస్తాయిగా అంటూ థియేటర్లకు వెళ్లడం మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

మరోవైపు మలయాళంలో పెద్ద హిట్ అయిన మోహన్ లాల్ ‘లూసిఫర్’ సినిమాకు తెలుగులో అసలు థియేటర్లు దొరకలేదు. కొన్ని థియేటర్లలో రిలీజ్ చేసినా జనం చూడడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు ప్రైమ్‌లో రిలీజైన తర్వాత అందరూ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ వంటి ఎడల్ట్ కామెడీకి కూడా ప్రైమ్‌లో ఆడియన్స్ ఎక్కువగానే ఉన్నారట.

మొత్తానికి టాలీవుడ్ సినిమాలకు అమెజాన్ గండి కొడుతోందన్న మాట మాత్రం వాస్తవమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.