దేశవ్యాప్తంగా నేడు వ్యాపారుల బంద్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సోమవారం వ్యాపారులు బంద్‌కు పిలునిచ్చారు. పుల్లవామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) ఈ పిలుపునిచ్చింది. సోమవారం వాణిజ్య సదుపాయాలన్నీ మూతపడుతాయని, వ్యాపార కార్యకలాపాలేవీ కొనసాగవని సీఏఐటీ తెలిపింది. బంద్ సందర్భంగా సోమవారం వ్యాపారులు ఉపవాసం ఉంటారని.. ఆయా రాష్ట్రాల్లో అమరవీరులకు నివాళిగా ఊరేగింపులో పాల్గొంటారని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ చెప్పారు.

దేశవ్యాప్తంగా నేడు వ్యాపారుల బంద్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:53 PM