శ్రీరాముడసలు భారతీయుడే కాదు.. నేపాల్ పీఎం కొత్త కాంట్రవర్సీ

భారత్ పట్ల వ్యతిరేఖ వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పంచాయతీ తెరమీదకు తెచ్చింది. కేవలం రాజకీయ పరంగానే కాకుండా భారత్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ..

శ్రీరాముడసలు భారతీయుడే కాదు.. నేపాల్ పీఎం కొత్త కాంట్రవర్సీ
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jul 14, 2020 | 1:53 PM

భారత్ పట్ల వ్యతిరేఖ వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పంచాయతీని తెరమీదకు తెచ్చింది. కేవలం రాజకీయ పరంగానే కాకుండా భారతీయ హిందువుల విశ్వాసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ. దేశంలోని ఎంతో మంది భక్తులు తమ ఆరాధ్య దైవంగా, ఆదర్శప్రాయంగా కొలుచుకునే శ్రీరాముడు ఓ నేపాలీ అని, భారతీయుడు కాదంటూ ఓలీ వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ నేపాల్‌లోనే ఉన్నాయని ఓలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రాముని జన్మస్థలం విషయంలో భారత్ వాస్తవాలు వక్రీకరిస్తుందంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యాఖ్యానించారు. నిజమైన అయోధ్య భారత్‌లో లేదన్నారు. నేపాల్ దేశంలోని పశ్చిమ బిర్గుంజ్‌కు సమీపంలోని థోరి గ్రామంలో ఉందని తెలిపారు. దశరథుని కుమారుడైన రాముడు భారతీయుడు కాదని అన్నారు. అయోధ్య థోరీలో ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం తమ దేశంలో రాముడి జన్మస్థలం ఉందని పేర్కొంటోందని ఓలీ వ్యాఖ్యానించారు. వాల్మికీ ఆశ్రమం కూడా నేపాల్‌లో ఉందన్నారు. పుత్రుల కోసం దశరథుడు యాగం నిర్వహించిన చోటు రిధి, ఇది కూడా నేపాల్‌లోనే ఉందని ఓలీ వాదించారు. అసలు అయోధ్య భారత్‌లో కాదు నేపాల్‌లో ఉందని ఆయన వాదించారు. ఈమేరకు నేపాల్ మీడియా కథనాన్ని ప్రసారం చేసింది.

గత కొద్ది కాలంగా భారత్ – నేపాల్ మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. ఇటీవల మన దేశ సరిహద్దులోని మూడు ప్రాంతాలను తమ భూభాగాలుగా చెప్పుకుంటూ.. ఓ మ్యాప్​ను విడుదల చేసింది నేపాల్​ కమ్యూనిస్ట్​ ప్రభుత్వం. అనంతరం ఆ మ్యాప్​ను నేపాల్​ పార్లమెంట్​లో ఆమోదింపజేసుకుంది. అప్పటి నుంచి నేపాల్​ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే భారత్‌లోని ప్రైవేట్ టీవీ ఛానల్స్‌పైనా నేపాల్ ప్రభుత్వం వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో భారత్‌లోని ప్రైవేట్ టీవీ ఛానల్స్ నేపాల్‌లో తమ ప్రసారాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా, భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న ప్రధాని కేపీ శర్మ ఓలీ తీరుపై అధికార నేపాలీస్ కమ్యూనిస్ట్ పార్టీ మండిపడుతోంది. భారత్​తో ఉన్న సత్సంబంధాలను ఓలి నాశనం చేస్తున్నారని.. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ.. పార్టీలోని సీనియర్​ నేతలు డిమాండ్​ చేస్తున్నారు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..