ఇరాక్‌లో శ్రీ రాముడు…

నిత్యం ఎక్కడో ఓ చోట శ్రీరాముడి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. కేవలం మన దేశంలోనే కాదు.. పొరుగున్న ఉన్న దేశాల్లో కూడా నిత్యం రామచంద్రుడికి సంబంధించిన గుర్తులు బయటపడుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఆసియా ఖండంలోని ముస్లిం దేశాల్లో ఒకటైన ఇరాక్‌లో శ్రీ రాముడి ఆనవాళ్లు బయటపడ్డాయి. హొరెన్‌ షెకాన్‌ ప్రాంతంలోని దర్బాంద్‌ ఇ బెలుల కొండ రాళ్లపై ఉన్న వీటిని ఉత్తరప్రదేశ్‌ నుంచి వెళ్లిన అయోధ్య శోధ్‌ సంస్థాన్‌ బృందం గుర్తించింది. ఇక్కడ రాముడికి సంబంధించిన […]

ఇరాక్‌లో శ్రీ రాముడు...
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2019 | 9:27 PM

నిత్యం ఎక్కడో ఓ చోట శ్రీరాముడి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. కేవలం మన దేశంలోనే కాదు.. పొరుగున్న ఉన్న దేశాల్లో కూడా నిత్యం రామచంద్రుడికి సంబంధించిన గుర్తులు బయటపడుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఆసియా ఖండంలోని ముస్లిం దేశాల్లో ఒకటైన ఇరాక్‌లో శ్రీ రాముడి ఆనవాళ్లు బయటపడ్డాయి.

హొరెన్‌ షెకాన్‌ ప్రాంతంలోని దర్బాంద్‌ ఇ బెలుల కొండ రాళ్లపై ఉన్న వీటిని ఉత్తరప్రదేశ్‌ నుంచి వెళ్లిన అయోధ్య శోధ్‌ సంస్థాన్‌ బృందం గుర్తించింది. ఇక్కడ రాముడికి సంబంధించిన రెండు చిత్రాలను గుర్తించామని వారు తెలిపారు. వాటిలో ఒకటి రాముడు విల్లు పట్టుకున్నట్టుగానూ.. మరొకటి మారుతి రూపంలోనూ ఉందని వెల్లడించారు. ఇవి 2వేల ఏళ్ల నాటివిగా భావిస్తున్నారు.

ప్రాచీన కాలంలో అత్యున్నత నాగరికతలుగా పేరుపొందిన సింధు, మెసపటోమియా నాగరికతల మధ్య సంబంధాన్ని వీటి ద్వారా గుర్తించే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. అయితే మరోవైపు ఈ చిత్రాలు గతంలో అక్కడి ప్రాంతాన్ని పరిపాలించిన రాజుదై ఉండవచ్చని ఇరాక్‌ చరిత్రకారులు చెబుతున్నారు.