తిరుమలలో వైభవంగా చంద్రప్రభ వాహనసేవ

శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి భక్తులకు..

  • Sanjay Kasula
  • Publish Date - 12:46 am, Fri, 23 October 20

chandra prabha vahanam : శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి చంద్రప్రభ వాహనసేవ వైభవోపేతంగా జరిగింది.

గురువారం ఉదయం సూర్య ప్రభ వాహనంపై మలయప్పస్వామి త్రివిక్రమ అంలంకారంలో దర్శనమిచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహనం.. అంటే దివారాత్రాలకు ఆయనే అధిపతి అన్న మాట..చంద్రప్రభ వాహనం మీద వచ్చే స్వామి చంద్రప్రభలకు ప్రతీకలుగా వున్న.. తెలుగు వస్తాలు.. తెల్లని పుష్పాలు.. మాలలు ధరిస్తారు..