Breaking News
  • టీవీ9 తో DME డా. రమేష్ రెడ్డి. ప్లాస్మా అనేది సంజీవని కాదని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పటికే ప్రకటించింది. ప్లాస్మా ట్రీట్ మెంట్ పై ఐసీఎంఆర్ ఇప్పటివరకు ఫైనల్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయలేదు. కొన్ని ప్రోటోకాల్స్ మాత్రమే ఇచ్చారు. గాంధీ లో 14 కేసులకు ప్లాస్మా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాము.. మంచి రిజల్ట్ వచ్చింది. ప్లాస్మా అనేది అవుట్స్టాండింగ్ ట్రీట్మెంట్లో include చేయాలా లేదా అనేది ఐ సి ఎం ఆర్ ఇంకా నిర్ధారించలేదు. ప్లాస్మా డోనర్స్ ముందుకు రావడం మంచి పరిణామం.
  • అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఇద్ద‌రు ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లో మార్పులు. స‌మ‌గ్ర‌శిక్షా అభ‌యాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ బాధ్య‌త‌ల నుంచి చిన‌వీర‌భ‌ద్రుడుని త‌ప్పించిన ప్ర‌భుత్వం. పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ గా చిన‌వీర‌భ‌ద్రుడు నియామ‌కం,ప్ర‌స్తుతం ఇంచార్జిగా ఉన్న చిన‌వీర‌భ‌ద్రుడు. స‌మ‌గ్ర‌శిక్షా అభ‌యాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ గా కె,వెట్రిసెల్వి నియామకం. ఇంగ్లీష్ మీడియం అమ‌లు ప్రాజెక్ట్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా వెట్రిసెల్వికి పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు.
  • ఏపీలో నూతన ఇండస్ట్రియల్ పాలసీ కి శ్రీకారం. ఇప్పటికే నూతన ఇండస్ట్రియల్ పాలసీ ని ఖరారు చేసిన సర్కార్ . సోమవారం పాలసీని లాంచ్ చేయనున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
  • ఈ ఏడాది సామూహిక నిమజ్జనం ఉండదు. దశల వారీ నిమజ్జనం. ప్రభుత్వానికి సహకరించాలి... కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఎత్తు విషయంలో పోటీలకు పోకుండా.. చిన్న మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. -- భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.
  • విమాన ప్రమాద స్థలానికి చేరుకున్న విదేశాంగ సహాయ మంత్రి వి. మురళీధరన్. ఘటనాస్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి. ఇద్దరు పైలట్లు సహా 18కి చేరిన మృతుల సంఖ్య.
  • కడపజిల్లాలో విషాదం. కమలాపురం మండలం యార్రగుడిపాడు గ్రామంలో అక్కచెల్లెళ్ల ఆత్మహత్యల్లో కొత్త కోణం. ముందురోజు ప్రొద్దుటూరులో తండ్రి బాబురెడ్డి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య. చనిపోయేముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన బాబు రెడ్డి. తన చావుకు అల్లుడు సురేష్ రెడ్డి కారణమని సెల్ఫీ వీడియోలో చెప్పిన బాబు రెడ్డి. అల్లుడు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ..తనకి న్యాయమూర్తి న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియో. తన తండ్రి చావుకు కారణం తన భర్తేనని తెలిసి రైలుకింద పది కుమార్తె స్వేతా రెడ్డి ఆత్మహత్య. అక్క చనిపోయిందని చెల్లెలు ఇంజినీరింగ్ విద్యార్థిని సాయి ఆత్మహత్య. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.
  • రానా పెళ్లి ఏర్పాట్లు పూర్తి. రామానాయుడు స్టూడియోలో రానా పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు రాత్రి 8-45 నిమిషాల శుభముహూర్తంలో రానా మిహికల వివాహం కారోనా నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు . స్టూడియోలోకి ప్రవేశించడానికి మై గేట్ యాప్ ద్వారా అనుమతి. లోపలికి వెల్లడానికి థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. రెయిన్ ప్రూఫ్ టెంట్ వేసి డెకరేషన్ చేసిన వధువు మిహిక సిబ్బంది. ఈరోజు రాత్రికి జరిగే పెళ్లికి హాజరు కానున్న వధూవరుల కుటుంబ సభ్యులు 35 మంది. బంధువులకు, ఫ్రెండ్స్ కి VR కిట్స్ ద్వారా పెళ్ళి చూసేందుకు ఏర్పాటు.

బడ్జెట్ ప్రసంగంలో బసవేశ్వరుని ప్రవచనాలు

Budget, బడ్జెట్ ప్రసంగంలో బసవేశ్వరుని ప్రవచనాలు

2019-20 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రత్యేకతను చూపారు. దేశ ఆర్ధిక మంత్రిగా ఆమె తొలి బడ్జెట్ ప్రసంగం చేస్తూ సంఘ సంస్కర్త బసవేశ్వరుని ప్రవచనాలను చదివి వినిపించారు. మధ్య యుగాలనాటి కాలంలో అనేక సాంఘిక దురాచారాలపై బసవేశ్వరుడు పోరాటం చేశాడు. ఆయన చెప్పిన కొన్ని ప్రవచనాలను కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ “కాయకవ కైలాస” అంటూ ప్రారంభించారు.

మనం ఏ వృత్తిలో ఉన్నా, లేక ఏ పని చేస్తున్నా దాన్ని ఎంతో శ్రద్దతో పూర్తి చేయాలి. దాసోహ అంటే మనం సంపాదించిన దానిలో కొంత భాగాన్ని సమాజ హితం కోసం తిరిగి ఇవ్వాలి. మనం ఎంచుకున్న వృత్తిని నిబద్దతతో చేయాలి. ఈ సూక్తిని చదివిన కేంద్రమంత్రి.. బసవేశ్వరుని ఆశయాల స్ఫూర్తితో కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో పనిచేస్తోందని దేశంలో దాదాపు 10 మిలియన్ల యువతకు నైపుణ్యాభివృద్దిలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్టుగా తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవభావంతో జీవించేందుకు వీలుగా అట్టడుగు వర్గాల యువత లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమాజంలోని అందరికి సంక్షేమ ఫలాలు అందివ్వాలన్న బసవేశ్వరుని బాటలో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.

Related Tags