చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న హైదరాబాద్ మెట్రో

ఓ నిండుప్రాణం బలైన తర్వాత గానీ హైదరాబాద్ మెట్రోకు ఙ్ఞానోదయం కలగలేదు. కుండ పోతగా కురుస్తున్న వర్షం నుంచి రక్షించుకునే ప్రయత్నంలో… హైదరాబాద్ అమీర్‌పేట మెట్రోస్టేషన్ కింద నిలబడ్డ యువతి మెట్రో స్టేషన్ మింగేసింది. నిర్మాణంలో నిర్లక్ష్యం కారణంగా వేలాడుతున్న పెచ్చులు ఊడి యువతి తలపై పడటంతో మృతి చెందింది. ఈ ఘటనతో మెట్రో స్టేషన్ల నిర్మాణంలో లోపాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మెట్రో స్టేషన్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిర్మాణ పనుల్లో […]

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న హైదరాబాద్ మెట్రో
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 7:01 PM

ఓ నిండుప్రాణం బలైన తర్వాత గానీ హైదరాబాద్ మెట్రోకు ఙ్ఞానోదయం కలగలేదు. కుండ పోతగా కురుస్తున్న వర్షం నుంచి రక్షించుకునే ప్రయత్నంలో… హైదరాబాద్ అమీర్‌పేట మెట్రోస్టేషన్ కింద నిలబడ్డ యువతి మెట్రో స్టేషన్ మింగేసింది. నిర్మాణంలో నిర్లక్ష్యం కారణంగా వేలాడుతున్న పెచ్చులు ఊడి యువతి తలపై పడటంతో మృతి చెందింది. ఈ ఘటనతో మెట్రో స్టేషన్ల నిర్మాణంలో లోపాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.

మెట్రో స్టేషన్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిర్మాణ పనుల్లో అలసత్వంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి కేటీఆర్ సూచనతో మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఆయా స్టేషన్లలో ఉన్న లోపాలను గుర్తించి సరిచేయించారు.

మెట్రో స్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టిన ఎల్ అండ్ టీకి చెందిన ఆరు బృందాలుగా ఎల్‌బీ నగర్ స్టేషనల్ నుంచి మియాపూర్ స్టేషన్ వరకు ఉన్న బాలనగర్, పెరేడ్ గ్రౌండ్స్, రసూల్‌పురా,హైటెక్ సిటీ, గాంధీ భవన్,ఎల్‌బీ నగర్, న్యూ మార్కెట్ మెట్రోస్టేషన్లతో సహా మొత్తం 20 స్టేషన్లను అణువణువు పరిశీలించి.. భారీ క్రేన్‌లు, ఫ్లడ్ లైట్స్ సహాయంతో లోపాలను సరిచేశారు.

ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము సమయాల్లో ఈ పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ..  భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.