గెహ్లాట్ కి గుణపాఠం చెబుతాం.. బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్ఛరిక

రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా ఎంటరయ్యారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ కి గట్టి గుణపాఠం చెబుతామని ఆమె హెచ్ఛరించారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను..

గెహ్లాట్ కి గుణపాఠం చెబుతాం.. బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్ఛరిక
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 28, 2020 | 12:46 PM

రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా ఎంటరయ్యారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ కి గట్టి గుణపాఠం చెబుతామని ఆమె హెచ్ఛరించారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేర్చేలా చూసినందుకు తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమె.. మేం సుప్రీంకోర్టుకు ఎక్కడానికైనా సిధ్ధమే అని ప్రకటించారు. 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో మెజారిటీ మార్కు 101 కన్నా కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దతు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. గెహ్లాట్, తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి.. తనకు సపోర్ట్ ఇస్తున్న సభ్యుల సంఖ్యను పెంచుకునేందుకు రాజస్థాన్ బహుజన్ సమాజ్ పార్టీని కాంగ్రెస్ లో విలీనమయ్యేలా చూశారు. ఈ వ్యవహారమంతా గత సెప్టెంబరులో జరిగింది. బీఎస్పీకి చెందిన ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు తమను కాంగ్రెస్ లో విలీనమైనవారిగా ప్రకటించుకున్నారు.

గెహ్లాట్ అనుసరించిన ఈ ‘దొడ్డిదారి పధ్దతి’ పట్ల మాయావతి అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా ఫైరవుతున్నారు.   ‘గతంలోనే తాము కోర్టుకు ఎక్కేవారమని, కానీ కాంగ్రెస్ పార్టీకి, గెహ్లాట్ కి గుణపాఠం చెప్పడానికి సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చామని’ మాయావతి అన్నారు. ప్రస్తుత రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో.. సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ వేస్తామని ఆమె చెప్పారు. ఇదే మంచి అవకాశమని తాము భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీలో గెహ్లాట్ ఫ్లోర్ టెస్ట్ ఎదుర్కొనే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు  వేయాలని ఆమె ఇదివరకే తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు.