‘అనారోగ్య ధోరణులకు దారి తీసే తీర్మానాలవి’.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం

సీఏఏను వ్యతిరేకిస్తూ యూరపియన్ పార్లమెంటు ఎంపీల్లో 600 మంది ఆరు తీర్మానాలను ప్రతిపాదించడంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  ఈ విధమైన తీర్మానాలు ‘అనారోగ్యకరమైన ధోరణులకు ‘ దారి తీస్తాయంటూ ఈయూ పార్లమెంటు అధ్యక్షునికి ఆయన లేఖ రాశారు.తమకు సంబంధం లేని మరో అంశంపై ఓ పార్లమెంటు ‘ తీర్పు’ను ఇవ్వడమన్నది సముచితం కాదని, స్వార్థపర శక్తులు ఇలాంటి పోకడను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆయన మండిపడ్డారు. […]

'అనారోగ్య ధోరణులకు దారి తీసే తీర్మానాలవి'.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 28, 2020 | 1:15 PM

సీఏఏను వ్యతిరేకిస్తూ యూరపియన్ పార్లమెంటు ఎంపీల్లో 600 మంది ఆరు తీర్మానాలను ప్రతిపాదించడంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  ఈ విధమైన తీర్మానాలు ‘అనారోగ్యకరమైన ధోరణులకు ‘ దారి తీస్తాయంటూ ఈయూ పార్లమెంటు అధ్యక్షునికి ఆయన లేఖ రాశారు.తమకు సంబంధం లేని మరో అంశంపై ఓ పార్లమెంటు ‘ తీర్పు’ను ఇవ్వడమన్నది సముచితం కాదని, స్వార్థపర శక్తులు ఇలాంటి పోకడను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆయన మండిపడ్డారు. భారత పార్లమెంటు ఉభయ సభల్లోనూ చర్చించిన అనంతరమే ఈ చట్టాన్ని ఆమోదించిన విషయాన్ని  గుర్తు చేశారు.’ మా దేశ పొరుగు దేశాల్లో మతపరమైన వివక్షకు గురవుతున్నవారికి సులభంగా పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించినదే ఈ చట్టం.. అంతేతప్ప.. ఒకరి నుంచి పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు ‘ అని ఓం బిర్లా స్పష్టం చేశారు.

సీఏఏ వల్ల ప్రపంచంలో అతి పెద్ద సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఈయూ పార్లమెంటులోని 751 మంది ఎంపీల్లో 600మంది ఆరు తీర్మానాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. పైగా మతపర మైనారిటీలను వేధించడం, ప్రాసిక్యూట్ చేయడం . దీన్ని వ్యతిరేకించేవారిని, మానవహక్కుల సంఘాలను నోరెత్తనివ్వకపోవడం.. అలాగే ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై చర్యలు తీసుకోవడంవంటివాటిని తాము ఖండిస్తున్నట్టు ఈ ఎంపీలు పేర్కొన్నారు. అందువల్లే ఏ ఒప్పంద సమయంలోనైనా  పటిష్టమైన మానవ హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన నిబంధన ఉండి తీరాలన్నారు. బ్రసెల్స్ లో వచ్ఛే వారం నుంచి ప్రారంభంకానున్న ఈయూ పార్లమెంటు సమావేశాల్లో ఈ తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.

ఇండియా-యూరపియన్ సమ్మిట్ కు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ మర్చి నెలలో బ్రసెల్స్ సందర్చించనున్నారు.  కాగా- పాకిస్తాన్ లో హిందూ యువతులు, సిక్కులు అణచివేతకు, వివక్షకు గురవుతుంటే ఈయూ ఎంపీలు ఎందుకు ప్రస్తావించడంలేదని కేంద్ర మంత్రి  రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. సీఏఏ అన్నది భారత అంతర్గత వ్యవహారమని ప్రధాని మోదీ స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.