కరోనా, కరోనా, ఈ నెల 23 తో లోక్ సభ ముగింపు ?

కరోనా వైరస్ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యుల ఆరోగ్యం, వారి సేఫ్టీపై ప్రభుత్వం దృష్టి నిలిపింది. పార్లమెంటుకు హాజరైన ఎంపీల్లో తాజాగా ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ సోకడంతో ఇక సమావేశాలను కుదించివేయాలని యోచిస్తోంది. ఈ నెల 23..

కరోనా, కరోనా, ఈ నెల 23 తో లోక్ సభ ముగింపు ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 19, 2020 | 7:17 PM

కరోనా వైరస్ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యుల ఆరోగ్యం, వారి సేఫ్టీపై ప్రభుత్వం దృష్టి నిలిపింది. పార్లమెంటుకు హాజరైన ఎంపీల్లో తాజాగా ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ సోకడంతో ఇక సమావేశాలను కుదించివేయాలని యోచిస్తోంది. ఈ నెల 23…బుధవారంతో లోక్ సభ సెషన్ ముగియవచ్ఛు. శనివారం సాయంత్రం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రతిపక్షాలతో చర్చించిన అనంతరం సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. పలు విపక్షాలు కూడా ఈ సమావేశాలను ఇక ముగించాలనే కోరుతున్నాయి. వచ్ఛే బుధవారంతో లోక్ సభ సెషన్ ముగియవచ్ఛునని, అలాగే రాజ్యసభ సమావేశాలకు కూడా ముగింపు పలుకుతారని తెలుస్తోంది.

ఈ వారారంభంలో ఇద్దరు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ పటేల్…ఇద్దరికీ ఈ సమావేశాలకు ముందు నెగెటివ్ వఛ్చినప్పటికీ ఆ తరువాత వారికి పాజిటివ్ అని తేలింది. నిన్న రాజ్యసభలో బీజేపీకి చెందిన వినయ్ సహస్రబుద్దే కి కరోనా వైరస్ పాజిటివ్ అని తెలిసింది. గత శుక్రవారం తనకు నెగెటివ్ రిపోర్టు రావడంతో సమావేశాలకు హాజరయ్యానని, కానీ నిన్న రాత్రి నుంచి స్వల్ప జ్వరం, తలనొప్పి రావడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని ఆయన చెప్పారు. ఇటీవలే లోక్ సభకు చెందిన 17 మందికి, రాజ్యసభకు చెందిన 8 మందికి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకింది. ఈ పార్లమెంట్ సెషన్ లో 11 ఆర్డినెన్స్ లను ఆమోదించాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటివరకు లోక్ సభ మూడు బిల్లులను మాత్రమే ఆమోదించిన విషయం గమనార్హం.