లోక్‌స‌భ హౌస్ కీప‌ర్‌కు క‌రోనా

యావ‌త్ దేశాన్ని క‌రోనా కోర‌ల‌తో వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు క‌రోనా సెగ‌తాకింద‌నే వార్త‌లు వింటున్నాం. తాజాగా లోక్‌స‌భ‌కు వైర‌స్ పాకిన‌ట్లుగా తెలుస్తోంది.

లోక్‌స‌భ హౌస్ కీప‌ర్‌కు క‌రోనా
Follow us

|

Updated on: Apr 22, 2020 | 12:41 PM

భార‌త్‌లో కోవిడ్ భూతం ప్ర‌కోపం చూపెడుతోంది. యావ‌త్ దేశాన్ని క‌రోనా కోర‌ల‌తో వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు క‌రోనా సెగ‌తాకింద‌నే వార్త‌లు వింటున్నాం. తాజాగా లోక్‌స‌భ‌కు వైర‌స్ పాకిన‌ట్లుగా తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే…
దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. లోక్‌సభ సచివాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ హౌస్‌కీపర్‌కు కరోనా వైరస్‌ సోకినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం బాధితుడిని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేర్పించినట్టు వెల్లడించారు. సెంట్రల్ ఢిల్లీలోని కలిబరి ప్రాంతంలో నివసిస్తున్న 58ఏళ్ల ఉద్యోగిని మంగళవారం ఉదయం 10.30నిమిషాలకు ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చేర్పించినట్టు వివరించారు. సోమవారం వెల్లడైన వైద్యపరీక్షా ఫలితాల్లో బాధితుడికి కోవిడ్‌ 19వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణౖందని లోక్‌సభ సచివాలయ డిప్యూటీ డైరెక్టర్‌ (వెల్ఫేర్‌) కేపీ బాల్యన్‌ మీడియాకు తెలిపారు. బాధిత ఉద్యోగి గత 35రోజుల నుంచి కార్యాలయంలో విధులకు హాజరుకాలేదని తెలిపారు. లాక్‌డౌన్‌ విధించడానికి నాలుగురోజుల ముందే అతను రావడం మానేశాడని బాల్యన్‌ తెలిపారు. బాధితుడు ఛాతీ నొప్పితో 12రోజుల క్రితం రామ్‌ మనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రిని సందర్శించినట్టు తెలిపారు. గత శుక్రవారం అతను జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలపై ఫిర్యాదు చేయడంతో కోవిడ్‌ 19 పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలిందని, అతడి కుటుంబ సభ్యులందరూ గృహ నిర్బంధంలో ఉన్నారని బాల్యన్ వివ‌రంచారు.