Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

బీజేపీ – శివసేన మధ్య పొడిచిన పొత్తు

, బీజేపీ – శివసేన మధ్య పొడిచిన పొత్తు

ముంబై : మొన్నటి వరకు ఉప్పు-నిప్పులా ఉన్న బీజేపీ -శివసేన మధ్య పొత్తు పొడిచింది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి. లోక్ సభ ఎన్నికల్లో శివసేన 23 స్థానాల్లోనూ, బీజేపీ 25 స్థానాల్లోనూ పోటీచేస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. రెండు పార్టీల మధ్య గతంలో విభేదాలున్నమాట నిజమేనని.. అయితే రెండు పార్టీలు సిద్ధాంతపరంగా ఒక్కటేనన్నారు. జాతి సమగ్రతను ఎవరైనా సవాల్ చేస్తే.. అలాంటి సమయంలో రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు. రెండు పార్టీల మధ్య బంధం రాజకీయేతరమైనదని.. బలమైన భారత్ కోసం పనిచేస్తాయంటూ ప్రధాని మోడీ కూడా ట్విట్ చేశారు. మరోవైపు బీజేపీ- శివసేనా కలిసి 48 స్థానాల్లో 45 చోట్ల విజయం సాధిస్తామన్నారు అమిత్ షా.