బ్రేకింగ్: బస్సులు నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ రెడీ

తెలంగాణలో రేపటి నుంచి బస్సులు నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని జిల్లాల్లో బస్సులు తిరగనున్నాయి. బస్సుల్లో 50 శాతం సీట్లకే ప్రయాణికులకు అనుమతి ఇవ్వనుంది ఆర్టీసీ. అలాగే ప్రతీ బస్సుల్లోనూ శానిటైజర్స్...

బ్రేకింగ్: బస్సులు నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ రెడీ
Follow us

| Edited By:

Updated on: May 18, 2020 | 1:48 PM

తెలంగాణలో రేపటి నుంచి బస్సులు నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని జిల్లాల్లో బస్సులు తిరగనున్నాయి. బస్సుల్లో 50 శాతం సీట్లకే ప్రయాణికులకు అనుమతి ఇవ్వనుంది ఆర్టీసీ. అలాగే ప్రతీ బస్సుల్లోనూ శానిటైజర్స్‌ ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా డిపోల్లో థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే.. విధుల్లోకి కార్మికులకు అనుమతి ఉంటుంది. కాగా ప్రస్తుతానికి అంతరాష్ట్ర సర్వీసులకు నో ఛాన్స్ అని స్పష్టం చేసింది ఆర్టీసీ. కాగా ప్రస్తుతం ఎంజీబీఎస్ వరకూ బస్సులకు పర్మిషన్ లేదు. హైదరాబాద్‌లోని జేబీఎస్ వరకే బస్సు సర్వీసులు నడవనున్నాయి. అలాగే వరంగల్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి బయల్దేరనున్నాయి. నల్గొండ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి బయల్దేరనున్నాయి. మహబూబ్ నగర్ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి నడిపే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. అయితే బస్సులు నడవనున్నాయా? లేదా అనేది మాత్రం కేబినెట్‌ భేటీలో చర్చించాక మాత్రమే దీనిపై తుది నిర్ణయం వెలువడుతుంది.

Read More: 

పెళ్లి విషయంపై నాగబాబుతో వరుణ్ తేజ్ గొడవ!

రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ఈ రోజు తేలనుంది

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం