ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్డెక్కనున్న బస్సులు, ఆటోలు..

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కేంద్రం లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో.. రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలను పినరయ్ విజయన్ సర్కార్ భారీగా

ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్డెక్కనున్న బస్సులు, ఆటోలు..
Follow us

| Edited By:

Updated on: May 18, 2020 | 4:29 PM

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కేంద్రం లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో.. రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలను పినరయ్ విజయన్ సర్కార్ భారీగా సడలించింది. దగ్గరి ప్రాంతాలకు బస్సు సేవలను ప్రారంభిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే బస్సుల్లో మాత్రం కేవలం 24 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా అధికారులు నిబంధన విధించారు.

కాగా.. బస్సులపై ఉండే ట్యాక్సులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఆటోలకు కూడా సర్కార్ అనుమతినిచ్చింది. అయితే కేవలం ఒకే ఒక ప్రయాణికుడ్ని ఎక్కించుకోవాలంటూ నిబంధన విధించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అయితే అంతర్ జిల్లాల్లో ప్రయాణానికి నిమిత్తమై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

అయితే.. నిబంధనల సడలింపులో భాగంగా.. లిక్కర్ షాపులకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే కేవలం పార్సల్ తీసుకెళ్లాలని, రెస్టారెంట్లలో కూర్చోని మద్యం సేవించరాదని కేరళ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ పాసుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలకు కష్టం కలగకుండా చూడాలని సమావేశంలో నిర్ణయించారు.