లాక్‌డౌన్‌తో టీనేజర్లకు మానసిక సమస్యలు ? నిపుణుల ఆందోళన

కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా టీనేజర్లకు ముందుముందు మానసిక సమస్యలు తలెత్తవచ్చునని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మెదడుతో బాటు మానసిక వికాసం కూడా కలగాలంటే ముఖాముఖి సోషల్ ఇంటరాక్షన్ ఎంతో అవసరమని వారు..

లాక్‌డౌన్‌తో టీనేజర్లకు మానసిక సమస్యలు ? నిపుణుల ఆందోళన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 13, 2020 | 6:53 PM

కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా టీనేజర్లకు ముందుముందు మానసిక సమస్యలు తలెత్తవచ్చునని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మెదడుతో బాటు మానసిక వికాసం కూడా కలగాలంటే ముఖాముఖి సోషల్ ఇంటరాక్షన్ ఎంతో అవసరమని వారు అంటున్నారు. ముఖ్యంగా 10-24 ఏళ్ళ మధ్య వయస్కుల గురించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రీసెర్చర్లు ప్రస్తావించారు. లాంగ్ టర్మ్ డ్యామేజీని కట్టడి చేయాలంటే తిరిగి స్కూళ్లను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని వీరు సూచిస్తున్నారు. దీర్ఘ కాలం  లాక్ డౌన్ వల్ల టీనేజర్ల ప్రవర్తనలో మార్పులు రావచ్చు.. వారి ఆలోచనా విధానాలు మారవచ్ఛు.. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో వారు బాధ పడవచ్చునని, ఈ కరోనా తరుణంలో వీరికి సోషల్ మీడియా ఒక్కటే కాస్త ఉపశమనం కలిగించవచ్ఛునని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు. తమ మిత్రులతో కలిసి మాట్లాడుకోవడంవల్ల వారి నెగెటివ్ ఎఫెక్ట్ తగ్గుతుందని, హార్మోన్లలో మార్పుల కారణంగా యువత తమ కుటుంబంతో కన్నా తమ ఫ్రెండ్స్ తో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతారని ఈ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు కూడా చెబుతున్నారు.  కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మార్చి రెండో వారం లేదా మూడో వారం నుంచే స్కూళ్లను మూసివేశారు. ఈ మహమ్మారి ఇంకా ప్రబలమవుతున్న నేపథ్యంలో.. పాఠశాలలను మరింత కాలం మూసే సూచనలే కనబడుతున్నాయి తప్ప ఇప్పట్లో…. లేదా సమీప భవిష్యత్తులో తిరిగి ప్రారంభించే అవకాశాలు కనబడడం లేదు.